క్రీడాభూమి

కోహ్లీ వికెట్ నాకో ప్రత్యేకం: లుంగీ ఎంగ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 17: ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడైన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను పడగొట్టడం తనకో ప్రత్యేక అనుభూతి ఇచ్చిందని, అది మరపురానిదని దక్షిణాఫ్రికా పేసర్ లంగీ ఎంగ్డి పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదోరోజు ఆట సందర్భంగా విరాట్‌కోహ్లీని ఎల్‌బీడబ్ల్యు చేయడం తనకు ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతుందని అన్నాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం ఏడు వికెట్లను సాధించిన తాను కోహ్లీ వికెట్ తీయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి అనుకున్నది సాధించినట్టు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో నింగ్డి 90 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. టెస్టుమ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన తనకు ఇది కొత్త అనుభూతి ఇచ్చిందని, ఒక క్రికెటర్‌గా సక్రమమైన పద్ధతిలో వ్యవహరించడం ద్వారా కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ఈ టోర్నీ తనకు దోహదపడుతుందని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నాడు.

చిత్రం.. దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగ్డి