క్రీడాభూమి

స్టోక్స్ దురదృష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 18: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను దురదృష్టం వెంటాడుతున్నది. ఒక బార్ వద్ద జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడన్న అభియోగాన్ని స్టోక్స్ ఎదుర్కొంటున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికైనప్పటికీ, యాషెస్ సిరీస్‌లో ఆడలేకపోయాడు. తాజాగా అతనిని ముక్కోణపు టీ-20 టోర్నమెంట్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. కానీ, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో స్టోక్స్ ఆడే అవకాశం లేదని తెలుస్తున్నది. ఫిబ్రవరి 13న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడాల్సి ఉంది. అయతే, అదే రోజు అతను లండన్‌లో కోర్టుకు హాజరుకావాలి. అక్కడ నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంపైనే స్టోక్స్ క్రీడా భవిష్యత్తు ఆధారపడుతుంది.