క్రీడాభూమి

జింబాబ్వేపై పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనూయి (న్యూజిలాండ్), జనవరి 18: జింబాబ్వేతో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోనున్నట్టు ఐసీసీ భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌లోకి బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్ జట్టు నాకౌట్ దశలోనే గత చాంపియన్ ఆస్ట్రేలియాతోపాటు, పపువా న్యూ గునియా టీమ్‌లను ఓడించిన విషయం తెలిసిందే. కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో, పృధ్వీ షా కెప్టెన్సీలో అటు పదునైన బ్యాటింగ్, ఇటు పటిష్టమైన బౌలింగ్ లైనప్‌తో అద్భుత ప్రదర్శనను కనబరిచి వీక్షకులను ఇట్టే ఆకట్టుకుని క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించింది. జట్టులో గాయపడిన బౌలర్ ఇషాన్ పొరెల్ స్థానంలో విదర్భ బౌలర్ ఆదిత్య ఠాక్రేను తీసుకునే అవకాశం ఉంది. భారత జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆంకుల్ రాయ్ ఇప్పటికే తన అద్భుత ఆటతీరుతో సహచరుల ప్రశంసలు అందుకున్నాడు. ఎలాంటి ఒత్తిడి ఎదురైనా అన్నిరకాలుగా తట్టుకునే సామర్థ్యం ఉన్న జట్టు కావడంతో జింబాబ్వేతో శుక్రవారం జరిగే మ్యాచ్‌ను అలవోకగా గెలుచుకోగలమన్న ధీమాను భారత్ జట్టు వ్యక్తం చేస్తోంది.

చిత్రం..ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైనప్పుడు
ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడుతున్న భారత అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీ షా