క్రీడాభూమి

ఆఫ్రికా దేశాలకు భారత్ గట్టిపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జనవరి 20: ముంబైలో ఆదివారం జరిగే 405,000 డాలర్ల టాటా ముంబై మారథాన్‌లో ఇన్నాళ్లూ ఆధిపత్యం చెలాయస్తున్న ఆఫ్రికన్ దేశాలైన కెన్యా, ఇథియోపియాలతో పోటీ పడుతున్న భారత్ రికార్డు సృష్టించాలని యోచిస్తోంది. పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించే ఈ మారథాన్‌లో పోటీ పడేందుకు భారత్‌కు చెందిన రన్నర్స్ ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పురుషుల విభాగంలో రికార్డు సాధించిన నితేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ 2016 నవంబర్‌లో చైనాలో జరిగిన పోటీలో మన దేశం తరఫున పాల్గొన్న గోపి తొనకల్ ఆసియన్ చాంపియన్‌షిప్ సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇపుడు కూడా తాము అదే ఉత్సాహంతో మారథాన్ పోటీల్లో విజయం సాధిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.