క్రీడాభూమి

షరపోవా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి రష్యా బ్యూటీ మరియా షరపోవా నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఏంజెలిక్ కెర్బర్‌ను ఢీకొన్న ఆమె 1-6, 3-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న కెర్బర్ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కనబరచింది. షరపోవాతో పదేపదే పొరపాట్లు చేయించి, విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకుల మద్దతు షరపోవాకే లభించినా, ఏమాత్రం లెక్కచేయని కెర్బర్ ఒక రకంగా ప్రత్యర్థికి టెన్నిస్ పాఠాలు నేరింది. పట్టుదల, ఏకాగ్రత ఉంటే, అనుకున్నది సాధించడం సులభమేనని నిరూపించింది.
ఇలావుంటే, 17వ ర్యాంక్ క్రీడాకారిణి మాడిసన్ కీస్ కూడా సిమోనా హాలెప్, ఏంజెలిక్ కెర్బర్‌తోపాటు ప్రీ క్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్‌లో ఆమె అనా బొగ్డాన్‌ను 6-3, 6-4 ఆధిక్యంతో ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ కరోలినా ఫ్లిస్కోవా తన స్నేహితురాలు లూసీ సఫరోవాను ఇంటిదారి పట్టించింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌ని ప్లిస్కోవా 7-6, 7-5 తేడాతో సొంతం చేసుకుంది. 18వ ర్యాంకర్ అష్లే బార్టీపై జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకా 6-4, 6-2 తేడాతో విజయం సాధించింది. ఎనిమిదో సీడ్ కరోలిన్ గార్సియా 6-3, 5-7, 6-2 తేడాతో అలెక్సాండ్రా సస్నోవిచ్‌పై గెలుపొందింది.

చిత్రం..మరియా షరపోవా