క్రీడాభూమి

ఆత్మహత్యకూ సిద్ధమయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, జనవరి 20: తీవ్రమైన మానసిక ఒత్తిడి, అసహనం, ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఒకానొక దశలో తనను ఆత్మహత్యకు పురిగొల్పాయని లెజెండరీ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ అన్నాడు. డిప్రెషన్ అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళుతుందో చెప్పడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించిన ఫెల్ప్స్ ఆ పోటీలు ముగిసిన వెంటనే తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు చెప్పాడు. నాలుగు రోజులపాటు తిండీ, నీరూ లేకుండా ఒక గదిలోనే ఉండిపోయానని, జీవించాలన్న కోరిక మాయమైందన్నాడు. అందుకే, అప్పట్లో ఆత్మహత్యకు కూడా తాను సిద్ధమయ్యానని మానసిక ఒత్తిళ్లు, వాటి ప్రభావాలపై ఇక్కడ జరిగిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఫెల్ప్స్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు. లండన్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ స్విమ్మింగ్‌కు స్వస్తి చెప్పాలని అనుకున్నట్టు కెరీర్‌లో రికార్డు స్థాయిలో 28 ఒలింపిక్ పతకాలు సాధించిన ఫెల్ప్స్ అన్నాడు. మానసిక ఒత్తిడి తీవ్రమైనప్పుడు జీవితంపై విరక్తి కలుగుతుందని, ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక బలమవుతుందని తెలిపాడు. సుమారు 17 సంవత్సరాలుగా తాను ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నానని తెలిపాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, 15 ఏళ్ల వయసులో ఫెల్ప్స్ తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అప్పటి నుంచే మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని, దీనితో మద్యానికి, మాదక ద్రవ్యాలను కూడా వినియోగించానని అన్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించి రికార్డు సృష్టించిన ఫెల్ప్స్ తన చివరి పోటీ ముగిసిన వెంటనే స్విమ్మింగ్ పూల్‌లోని ఒక మూలకు వెళ్లి సిగరెట్ తాగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆతర్వాత స్వదేశంలో రెండు పర్యాయాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి అరెస్టు అయ్యాడు. మానసికంగా ఒత్తిడికి గురికావడమే తన ప్రధాన సమస్యగా ఫెల్ప్స్ పేర్కొన్నాడు. దీని నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడుతున్నానని తెలిపాడు.
తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనకు లోనైన ఒలింపియన్ ఫెల్ప్స్ ఒక్కడేకాదు.. ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ థోర్ప్ వంటి హేమాహేమీలు కూడా ఉన్నారు. కెరీర్‌లో 22 ప్రపంచ రికార్డులను బద్దలు చేసి, కొత్త రికార్డులు సృష్టించిన థోర్ప్ 2012లో తన ఆత్మకథను రాసుకున్నాడు. అందులో మానసిక ఒత్తిడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక బలంగా ఉండేదని తెలిపాడు. సొంత వైద్యంతో ఇలాంటి సమస్య నుంచి బయటపడలేమని, నిపుణుల పర్యవేక్షణలో సరైన వైద్య సేవలు పొందడం అత్యవసరమని థోర్ప్ తన ఆత్మకథలో యువతకు సూచించాడు.

చిత్రం..లెజెండరీ స్విమ్మర్ ఫెల్ప్స్