క్రీడాభూమి

విజేత భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, జనవరి 20: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించిన అంధుల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు నిలబెట్టుకుంది. 40 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ శనివారం జరిగిన ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా రెండు పర్యాయాలు ఈ టైటిల్‌ను సాధించిన రెండో జట్టుగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఇంతకుముందు పాకిస్తాన్ కూడా రెండు పర్యాయాలు విజేతగా నిలిచింది. ఆ రికార్డును ఇప్పుడు భారత్ సమం చేసింది. తుది పోరులో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 309 పరుగులు సాధించింది. బదర్ మునీర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిసత్ ఖాన్ 48, నిసార్ అలీ 47 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 38.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సునీల్ రమేష్ 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో అతను సెంచరీని కోల్పోయినప్పటికీ, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ అజయ్ రెడ్డి 63 పరుగులు సాధించాడు. మొత్తం మీద ఈసారి అంధుల వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్‌ని కూడా చేజార్చుకోకుండా, అజేయ జట్టుగా నిలిచిన భారత్ తన లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు కోల్పోయి అందుకుంది. రెండు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి, వరుసగా రెండోసారి ట్రోఫీని గెల్చుకుంది.