క్రీడాభూమి

వొజ్నియాకి ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 21: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి కరోలిన్ వొజ్నియాకి ముందంజ వేసింది. నాలుగో రౌండ్‌లో ఆమె 19వ సీడ్ మగ్దలీన రిబరికొవాపై 6-3, 6-0 ఆధిక్యంతో విజయభేరి మోగించింది. మొదటి సెట్‌లో కొంత వరకూ ప్రతిఘటించిన రిబరికొవా రెండో సెట్లో పూర్తిగా విఫలమైంది. వొజ్నియాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి కారియా సౌరెజ్ నవరో 4-6, 6-4, 8-6 ఆధిక్యంతో 32వ సీడ్ అనెట్ కొంటావెల్ట్‌ను ఓడించింది. కాగా, క్వాలిఫయర్ డెనిసా ఎలెర్టొవాపై 6-3, 6-3 తేడాతో గెలిచిన నాలుగో సీడ్ ఎలినా స్విటోలినా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో ఎలిసా మార్టెన్స్ 7-6, 7-5 స్కోరుతో పెట్రా మార్టిక్‌పై విజయాన్ని నమోదు చేసింది.

చిత్రం..కరోలిన్ వొజ్నియాకి