క్రీడాభూమి

క్వార్టర్స్‌కు నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 21: ఎండ వేడికి ఏమాత్రం తట్టుకోలేక ఇబ్బంది పడే ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు రాఫెల్ నాదల్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. కడ వరకూ పోరాడి, చెమటలు చిందించిన అతను నాలుగో రౌండ్‌లో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో డిగో స్వార్ట్‌మన్‌ను 6-3, 6-7, 6-3, 6-3 తేడాతో ఓడించాడు. మొదటి రెండు సెట్లలో కొంత ఇబ్బంది పడిన నాదల్ ఆతర్వాత రెండు సెట్లలో తనదైన దూకుడును ప్రదర్శించి, టైటిల్ సాధించే సత్తా తనకు ఉందని నిరూపించాడు. ఇదే మాదిరి చివరి వరకూ ఉత్కంఠ రేపిన మరో మ్యాచ్‌లో నిక్ కిర్గియోస్‌పై మూడో ర్యాంక్ ఆటగాడు గ్రెగర్ దిమిత్రోవ్ 7-6, 7-6, 4-6, 7-6 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఆరోసీడ్ మారిన్ సిలిక్ కూడా నాలుగో రౌండ్‌ను అధిగమించడానికి చివరి వరకూ పదోరాడాల్సి వచ్చింది. అతను పదో ర్యాంకర్ పాబ్లో కరెనో బస్టాను 6-7, 6-3, 7-6, 7-6 తేడాతో ఓడించాడు.