క్రీడాభూమి

ఏప్రిల్‌లో 11వ ఐపీఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఈ ఏడాది జరిగే 11వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 7న మొదలవుతుంది. టోర్నీ పాలక మండలి సోమవారం ప్రకటించిన వివరాల ప్రకారం, 11వ ఐపీఎల్ ఏప్రిల్ 7న మొదలై మే 27న ముగుస్తుంది. మన దేశంలోనేగాక, యావత్ ప్రపంచంలోనూ అత్యధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టే టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌లో ఈసారి మొదటి మ్యాచ్‌కి ముంబయి ఆతిథ్యమిస్తుంది. కాగా, మ్యాచ్‌లు మొదలయ్యే సమయాలను కూడా ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మార్చింది. ఇంతకు ముందు డే మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకు, డే/నైట్ మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు మొదలయ్యేవి. అయితే, బ్రాడ్‌కాస్టర్ల విజ్ఞప్తి మేరకు డే మ్యాచ్‌లను సాయంత్రం 5.30 గంటలకు, డే/నైట్ మ్యాచ్‌లను రాత్రి 7 గంటలకు మొదలుపెట్టనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఒక ప్రకటనలో తెలిపాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తన హోం గేమ్స్‌లో నాలుగు మ్యాచ్‌లను మొహాలీలో, మూడు మ్యాచ్‌లను ఇండోర్‌లో ఆడుతుందని అతను తెలిపాడు. రెండేళ్ల సస్పెన్షన్‌ను ముగించుకొని, మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ హోం గేమ్స్ వేదికను ఇంకా ఖరారు చేయలేదని తెలిపాడు. ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో కేసు నడుస్తున్నదని, 24వ తేదీన తీర్పు వెలువడిన తర్వాత వేదికలను ఖాయం చేస్తామని శుక్లా వివరించాడు. ఈనెల 27, 28 తేదీల్లో జరిగే ఐపిఎల్ వేలంలో మొత్తం 578 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని వివరించాడు.