క్రీడాభూమి

జొకోవిచ్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 22: మోచేతి గాయం కారణంగా సుమారు ఆరు నెలలు విశ్రాంతి తీసుకొని, తిరిగి అంతర్జాతీయ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టిన ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ పోరాటం ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌తో ముగిసింది. దక్షిణ కొరియాకు చెందిన చుంగ్ హియాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో జొకోవిచ్ 6-7, 5-7, 6-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ అతను 12 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను అందుకోగా, వాటిలో ఆరు ఆస్ట్రేలియా ఓపెన్‌లో కైవసం చేసుకున్నవే కావడం గమనార్హం. 2016లో చివరిసారి ఇక్కడ విజేతగా నిలిచిన జొకోవిచ్ ఫిట్‌నెస్‌తోపాటు ఫామ్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను గాయం సమస్యను అధిగమించి, నాలుగో రౌండ్ వరకూ చేరాడు. కానీ, హియాన్ అనూహ్య విజృంభణతో కంగుతిన్నాడు. తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం లేక, వరుస సెట్లలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఎవరీ హియాన్?
ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఒక పేరు టెన్నిస్ రంగంలో మారుమోగుతున్నది. ప్రపంచ మాజీ నంబర్ వన్ జొకోవిచ్ వంటి స్టార్‌ను ఓడించిన దక్షిణ కొరియా యువ ఆటగాడు హియాన్ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ చేరడం 21 ఏళ్ల హియాన్‌కు ఇదే మొదటిసారి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 44వ ర్యాంక్ వరకూ చేరిన అతను ప్రస్తుతం 58వ స్థానంలో ఉన్నాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరడం అతనికి అత్యుత్తమ ప్రదర్శనకాగా, ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లి, తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించుకున్నాడు. 2015 వింబుల్డన్‌లో మొదటి రౌండ్‌కే పరిమితమైన అతని పోరు, మరో గ్రాండ్ శ్లామ్ యుఎస్ ఓపెన్‌లో రెండు పర్యాయాలు (2015, 2017) రెండో రౌండ్ నుంచి నిష్క్రమించాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ ఏడాది తొలి గ్రాండ్ శ్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో టెనిస్ శాండ్‌గ్రీన్‌తో పోరుకు సిద్ధమవుతున్నాడు. సోమవారం జరిగిన మరో ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో శాండ్‌గ్రీన్ అసాధారణ ప్రతిభ కనబరచి, ఐదో సీడ్ డామినిక్ థియేమ్‌ను 6-2, 4-6, 7-6, 6-7, 6-3 తేడాతో ఓడించి, క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. సెమీస్‌లో స్థానం కోసం సంచలన వీరులు హియాన్, శాండ్‌గ్రీన్ మధ్య జరిగే పోరు ఉత్కంఠ రేపనుంది.
చిత్రం..అనుకోని విజయం.. చుంగ్ హియాన్‌