క్రీడాభూమి

కెయిల్ ఎడ్మండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 3 ఆటగాడు గ్రిగర్ డిమిట్రోవ్ ఓటమి చెందాడు. ఇతనితో తలపడిన ఇంగ్లాండ్‌కు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు 23 ఏళ్ల కెయిల్ ఎడ్మండ్ విజయం సాధించి ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌లోకి వెళ్లిన ఆరో బ్రిటీష్ ఆటగాడిగా ఘనత సాధించాడు. రెండు గంటల 49 నిమిషాలపాటు జరిగిన టోర్నీలో ప్రపంచ 49 నెంబర్ ఆటగాడైన కెయిల్ 6-4, 3-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో కెయిల్ 16 సార్లు గ్రాండ్ శ్లామ్ చాంపియన్‌షిప్ సాధించిన రాఫెల్ నాదల్ లేదా మారిన్ సిలిస్‌తో ఫైనల్‌లో తలపడతాడు. సెమీఫైనల్స్‌లో గెలుపు క్షణాలను మరువలేనని ఎడ్మండ్ సంతోషం వ్యక్తం చేశాడు. రోడ్ లావర్ అరెనా మైదానంలో ఆడడం తనకు ఇదే మొదటిసారని, ఈ గెలుపు తనకు ఒక ప్రత్యేకతగా నిలుస్తుందని అన్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఆండీ ముర్రే ఐదుసార్లు ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్‌లో సెమీఫైనల్‌కు చేరిన ఆటగాడిగా ఘనత సాధించి, గాయం కారణంగా టోర్నీకి ముందే తప్పుకున్నాడు. ముర్రే తర్వాత ఆ స్థానాన్ని ఎడ్మండ్ భర్తీ చేస్తూ ఘనత సాధించాడు.

చిత్రం..కెయిల్ ఎడ్మండ్