క్రీడాభూమి

నా ఆలోచనలను పిల్లలపై రుద్దను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 23: తన పిల్లలకు కూడా ఆటలంటే చాలా ఇష్టమని, అలాగని వారిని కూడా తనలాగే టెన్నిస్‌పైనే దృష్టి సారించాలని కోరుకోవడం లేదని టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అన్నాడు. తన ఆట తీరును భార్య మిర్కాతోపాటు పిల్లలు అదే పనిగా చూడరని అన్నాడు. గత కొనే్నళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్తున్నపుడు సైతం తన ప్రదర్శనను చూడమని వారిపై ఒత్తిడి తీసుకురానని పేర్కొన్నాడు. అయితే, తన పిల్లలు ఏ రంగాన్ని ఎంచుకుంటే దానిలోనే ఉత్తములుగా ఉండాలని తాను ఒక తండ్రిగా అభిలషిస్తానని అన్నాడు. ఒక తండ్రిగా పిల్లల ఎదుగుదలను ప్రోత్సహిస్తానని, కానీ వారు ఏ దారిలో వెళ్తున్నారో అన్న విషయాన్ని తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. అయితే, వారు క్రీడారంగం ఎంచుకున్నా, లేదా వ్యాపార రంగం ఎంచుకున్నా, ఆర్థిక రంగం ఎంచుకున్నా తాను అభ్యంతరం పెట్టబోనని, వారు ఎంచుకున్న మార్గం సరైనదైతే చాలని కోరుకుంటానని, దానినే ప్రోత్సహిస్తానని అన్నాడు.