క్రీడాభూమి

స్మిత్‌కు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 23: వచ్చేనెల దక్షిణాఫ్రికాలో జరిగే టి-20 ఇంటర్నేషనల్ ట్రై సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విశ్రాంతినిచ్చారు. ఆతని స్థానంలో డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో ఈ జట్టు తలపడనుంది. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా వార్నర్‌ను దక్షిణాఫ్రికాతో జరిగే టి-20తో ఆడేందుకు వీలుగా ఎంపిక చేసిన జట్టులో ఇప్పటివరకు వైస్‌కెప్టెన్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని, కెప్టెన్ మార్పు విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని చీఫ్ సెలెక్టర్ ట్రెవర్ హాన్స్ పేర్కొన్నాడు. స్టీవ్ స్మిత్‌కు కొంతకాలంపాటు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. వార్నర్ బాగా పరిణితి చెందిన క్రీడాకారుడైనందున స్టీవ్ స్మిత్ లేని లోటును భర్తీ చేస్తాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి సామర్థ్యం ఉన్న వారినే ఎంపిక చేశామని, వీరందరి కృషితో ముక్కోణపు టోర్నీలో విజయం సాధించగలమనే ధీమాను ఆయన వ్యక్తం చేశాడు.
ట్రై సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఆరోన్ పింఛ్, ఆస్టన్ అగర్, అలెక్స్ కారీ, బెన్ వార్‌షూష్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, గ్లేన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డార్సీ షార్ట్, బిల్లీ స్టాన్‌లేక్, మార్కస్ స్టోయిన్‌సిస్, ఆండ్రూ టై, ఆడం జంపా.