క్రీడాభూమి

కొంతకాలమే పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్, జనవరి 23: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ గ్రీమీ స్మిత్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుమ్యాచ్‌లలో భారత్ ఓటమి చెంది, ఈనెల 24న మూడో మ్యాచ్‌కు తయారవుతున్న వేళ స్మిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు ఆ జట్టును ఏదశలోనూ ఆదుకోలేకపోయాయని ఇప్పటికే తమతో జరిగిన రెండు మ్యాచ్‌ల ఫలితమే నిదర్శనమని అన్నాడు. సరైన జట్టు ఎంపికతో సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో కోహ్లీ సరిగా వ్యవహరించలేకపోవడం వల్లే భవిష్యత్‌లో ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగలేడేమోనన్న అనుమానం తనకు ఉందని అన్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుమ్యాచ్‌లలో జట్టు కూర్పులో కోహ్లీ నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోవడం వల్లనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పలువురు క్రీడా మేధావులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్మిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కోహ్లీపై వస్తున్న విమర్శల జడివానను తట్టుకునేందుకు, అతనిని సరైన మార్గదర్శకత్వంలో నడిపించేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వచ్చేవారిని ఆహ్వానించాలని ఆయన సూచించాడు. మైదానంలో కోహ్లీ వైఖరి, హావభావాలు ఆ జట్టు సభ్యులపై పడే అవకాశం ఉందని అన్నాడు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైనా, తన ఆటతీరుతో ఎందరో విమర్శకుల ప్రశంసలు పొందినా అవి అతని వ్యక్తిగతమని, కానీ జట్టును సమర్థవంతంగా ముందుకు నడపడంలో ఇతరుల ప్రభావం ఉంటుందని మరువరాదని అన్నాడు. నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని అందర్నీ కలుపుకునిపోయే తత్వం ఉంటే అన్ని విభాగాల్లోనూ రాణించగలమన్నాడు. 117 టెస్టు మ్యాచ్‌లు, 197 వండే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన స్మిత్ తన జట్టును విజయవంతంగా నడపడంలో పరిణితి చెందిన క్రీడాకారునిగా వినుతికెక్కాడు.