క్రీడాభూమి

మూడో టెస్టు మ్యాచ్ పరువు నిలిపేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్సస్‌బర్గ్, జనవరి 23: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఘోర పరాజయం పాలైన భారత్ క్రికెట్ జట్టు బుధవారం వాండరర్స్‌లో జరిగే మూడో మ్యాచ్‌లోనైనా మన దేశ పరువు నిలబెడుతుందా? లేదా? అన్న సందేహాలు అభిమానుల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ సారధ్యంలో మూడో టెస్టులోనూ భారత్‌పై పైచేయి సాధించేందుకు తద్వారా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఉరకలేసిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. రెండు టెస్టుల్లోనూ పేలవమైన ఆటతీరుతో భంగపడిన భారత్ మూడో టెస్టులోనైనా ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చి విమర్శకుల నోటికి తాళం వేయడానికి కెప్టెన్ సారధ్యంలోని జట్టు అస్తశ్రస్త్రాలు సంధిస్తోంది. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్ట్‌మ్యాచ్‌లో 72 పరుగులు, సెంచూరియన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 135 పరుగుల ఆధిక్యంతో వచ్చిన విజయగర్వంతో మూడో టెస్టులోనూ భారత్‌ను మట్టికరిపించేందుకు దక్షిణాఫ్రికా సన్నాహాలు చేస్తోంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో జరిగిన పలు టెస్టుమ్యాచ్‌లలో వరుసగా రెండింటిలోనూ భారత్ ఓటమిపాలు కావడం ఇదే తొలిసారి. అయితే, 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన టెస్టు సిరీస్‌లలో భారత్ తొమ్మిదిసార్లు గెలుపు బావుటాను ఎగురవేసి ఇప్పటివరకు సాధించిన తొలి ర్యాంక్‌కు ఎలాంటి ఢోకా లేకపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో జట్టు
ఎంపికలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న కెప్టెన్ కోహ్లీ తనదైన రీతిలో స్పందించినప్పటికీ మ్యాచ్‌లలో ఫలితాలు వెక్కిరించడంతో ఓటమికి బ్యాట్స్‌మెన్‌లదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. గడిచిన రెండు టెస్టులకు పేసర్ భువనేశ్వర్ కుమార్‌తోపాటు జస్‌ప్రీత్ బుమ్రా ఎంపిక పలు విమర్శలకు దారితీసినా బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌పైనే అభిమానుల ఆశలు ఉన్నాయి. ఇప్పటికే మూడో టెస్టు కోసం సిద్ధంగా ఉన్న భారత్ జుట్టలోని ఐదుగురు పేసర్లలో భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ తదితరులంతా సోమవారం నుండి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇపుడున్న జట్టులోని పేసర్లలో కనీసం ఒకరినైనా మార్చే దిశగా కోహ్లీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జట్టులో ఐదారుగురు పేసర్లు, మరో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లతో భారత్ జట్టు తుదిపోరుకు సిద్ధమవుతోంది. కెప్టెన్‌గా ఆరు నెలల కిందట జరిగిన టెస్టు మ్యాచ్‌లలో 3-0 తేడాతో శ్రీలంక జట్టును మట్టి కరిపించిన కోహ్లీ దక్షిణాఫ్రికా టూర్‌లోనూ అదే సంచలనం నమోదు చేస్తాడనుకున్న అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ ఇప్పటికే 2-0 స్కోరుతో భారత్ వెనుకబడి ఉంది. ఇప్పటివరకు ఏ భారత్ జట్టు కూడా దక్షిణాఫ్రికాలో ఆ దేశ జట్టును వైట్ వాష్ చేయలేకపోయింది. 1992 నుండి భారత్ ఆరుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. 1996-97లో సచిన్ తెండూల్కర్ నాయకత్వంలో ఆడిన మూడు టెస్టు సిరీస్‌లలో 2-0 తేడాతో భారత్ అపజయాన్ని మూటకట్టుకుంది.
బుధవారం జరిగే తుది పోరులో దక్షిణాఫ్రికా జట్టులో మేజర్ మార్పులు చేయడం ద్వారా వచ్చే తలనొప్పులను భరించలేనందున చిన్నపాటి మార్పులు, చేర్పులతోనే సిద్ధమైంది. ఈ జట్టులో రెండో టెస్టులో తొడ సంబంధ నొప్పితో బాధపడుతున్న ఓపెనర్ ఎయిడెన్ మార్కంను మూడో టెస్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రి బ్యాట్స్‌మన్ టెంబా బౌమా చేతి వేలి గాయం కారణంగా ప్రస్తుతం ఆడే అవకాశం లేకపోయినా క్రిస్ మోరిస్, ట్యూనిస్ డి బ్రూన్ ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చు. ఇదిలావుండగా, మూడో టెస్టులో భారత్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేయడంతోపాటు త్వరలో ఆస్ట్రేలియా జరిగే టెస్టుమ్యాచ్‌లలో 2-0 తేడాతో విజయం సాధించి ప్రపంచంలోనే తొలి ర్యాంక్‌ను సాధిస్తామనే ధీమాను కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ వ్యక్తం చేస్తున్నాడు. భారత్‌తో జరిగే మూడో టెస్టుమ్యాచ్‌ల అనంతరం ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు సిరీస్‌లలో ఆడబోయే జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.