క్రీడాభూమి

సెమీస్‌లోకి అన్‌సీడెడ్ క్రీడాకారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో అన్‌సీడెడ్‌గా దిగిన మెర్టెన్స్ రూట్స్ మంగళవారం జరిగిన పోటీలో ప్రపంచ నాలుగో నంబర్ క్రీడాకారిణి ఎలినా సిటొలినాను ఓడించి ఏకంగా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బెల్జియంకు చెందిన 22 ఏళ్ల మెర్టెన్ ఇప్పటివరకు ప్రపంచ 37వ ర్యాంకర్‌గా ఉంది. ఒక గంట 13 నిమిషాలపాటు జరిగిన పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన ఎలినాను ఆమె 6-4, 6-0 తేడాతో మట్టికరిపించింది. 2012 తర్వాత ఒక బెల్జియం క్రీడాకారిణి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లడం ఇది రెండోసారి. ఈ ఘనతను మెర్టెన్ దక్కించుకుంది. సెమీస్‌లోకి వెళ్లడాన్ని మాటల్లో వర్ణించలేనని, చెప్పడానికి మాటలు కూడా రావడం లేదని, ఇన్నాళ్లూ చేసిన కృషికి తగిన ఫలితం దక్కిందని భావిస్తున్నానని పేర్కొంది. 2016 వరకు 127వ ర్యాంకర్‌గా ఉన్న మెర్టెన్స్‌ను ఆమె బోయ్ ఫ్రెండ్, కోచ్ అయిన రోబీ సెస్సన్స్ ఉత్తమ క్రీడాకారిణిగా తీర్చిదిద్దాడు. తాను ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లడానికి కోచ్ రోబీ కృషి ఎంతో ఉందని, ఈ ఘనత అంతా అతనికే దక్కుతుందని ఆమె పేర్కొంది.

చిత్రం..మెర్టెన్స్ రూట్స్