క్రీడాభూమి

జట్టు ప్రదర్శనపై పిసిబికి వకార్ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 29: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో జట్టు వైఫల్యాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తీవ్ర అసంతృప్తితో ఉంది. కాగా, పిసిబి ఆదేశం ప్రకారం ఈమెగా టోర్నీలో జట్టు ప్రదర్శనపై వివరాలతో కూడిన నివేదికను కోచ్, మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సమర్పించాడు. ఈ విషయాన్ని పిటిఐతో మాట్లాడిన పిసిబి అధికారులు ధ్రువీకరించారు. వకార్ నుంచి నివేదిక అందిందని తెలిపారు. ఎక్కువ మంది ఆటగాళ్లు ముందుగా నిర్ధారించుకున్న గేమ్‌ప్లాన్‌ను అమలు పరచలేదని వకార్ తన నివేదికలో స్పష్టం చేసినట్టు చెప్పారు. కోచింగ్ విభాగం చేసిన ఏ సూచనకూ పలువురు క్రికెటర్లు సానుకూలంగా స్పందించలేదని వకార్ తెలిపాడని అన్నాడు. కాగా, షహీద్ అఫ్రిదీ నాయకత్వ సామర్థ్యాన్ని కూడా అతను తన నివేదికలో ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తం మీద అతను జట్టు ఆడిన విధానంపై సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అదే విధంగా చీఫ్ సెలక్టర్ హరూన్ రషీద్ అనుసరిస్తున్న విధానంపైనా అతను అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇలావుంటే, ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు పిసిబి ఇప్పటికే ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. వకార్ ఇచ్చిన నివేదికను ఆ కమిటీకే పిసిబి పంపింది. వకార్ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ, జట్టు మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించినట్టు తెలుస్తోంది.