క్రీడాభూమి

మహిళలకూ ఐపిఎల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: క్రికెట్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను మహిళల విభాగంలోనూ నిర్వహిం చాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఆస్ట్రేలియాలో పేరుప్రతిష్ఠలు సంపాదించిన బిగ్‌బాష్‌తోపాటు ఇంగ్లాండ్‌లో జరిగే సూపర్ లీగ్ పోటీల్లోనూ మ హిళలకు స్థానం దక్కింది. అదే విధంగా మహిళ ల కోసం ఐపిఎల్‌ను నిర్వహించాలని భారత క్రికె ట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ను ఇంగ్లాండ్, ఆ స్ట్రేలియా మహిళా జట్ల కెప్టెన్లు చార్లొట్ ఎడ్వర్డ్స్, మెగ్ లానింగ్ కోరారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్స హించడానికి ఇది అత్యవసరమని వారు పిటిఐతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. బిగ్‌బాష్‌లో పాల్గొనడం ద్వారా మహిళా క్రికెటర్లు అంతర్జాతీ య ప్రమాణాలను సంపాదిస్తున్నారని లానింగ్ తె లిపింది. మహిళల క్రికెట్ అభివృద్ధి చెందాలంటే మేజర్ టోర్నీలను మహిళల కోసం కూడా నిర్వ హించాలని సూచించింది. ఇంగ్లాండ్‌లో సూపర్ లీగ్ గతంలో పురుషులకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు మహిళల విభాగంలోనూ నిర్వహి స్తున్న విషయాన్ని చార్లొట్ గుర్తుచేసింది. ఐపిఎల్ ను కూడా మహిళల కోసం ప్రత్యేకంగా జరిపితే బాగుంటుందని చెప్పింది.