క్రీడాభూమి

‘్థమస్’లో సులభం.. ‘ఉబేర్’లో జటిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: పురుషుల విభాగంలో జరిగే థామస్ కప్‌లో భారత బాడ్మింటన్ జట్టుకు సులభమైన డ్రా దక్కింది. అయితే, ఉబేర్ కప్ కోసం పోటీపడే మహిళల కోసం జటిలమైన డ్రా ఎదురు చూస్తున్నది. చైనాలోని జియాంగ్‌షూ ప్రావీన్స్ కున్‌షాన్‌లో మే 15 నుంచి 22వ తేదీ వరకు థామస్, ఉబేర్ కప్ పోటీలు జరగనున్నాయ. థామస్ కప్‌లో ఇండోనేషియా, థాయిలాండ్, హాంకాంగ్‌తో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీపడుతున్నది. గ్రూప్ ‘ఎ’లో చైనా, జపాన్, ఫ్రాన్స్, మెక్సికో, గ్రూప్ ‘సి’లో కొరియా, మలేసియా, ఇంగ్లాండ్, జర్మనీ, గ్రూప్ ‘డి’లో డెన్మార్క్, చైనీస్ తైపీ, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. కాగా ఉబేర్ కప్‌లో జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి మేటి జట్లతో గ్రూప్ ‘డి’ నుంచి భారత మహిళల జట్టు పోటీపడాల్సి ఉంది. గ్రూప్ ‘ఎ’లో చైనా, డెన్మార్క్, స్పెయిన్, మలేసియా, గ్రూప్ ‘బి’లో కొరియా, చైనీస్ తైపీ, మారిషస్, అమెరికా, గ్రూప్ ‘సి’ నుంచి థాయిలాండ్, ఇండోనేషియా, బల్గేరియా, హాంకాంగ్ పోటీపడనున్నాయి.