క్రీడాభూమి

మియామీ ఓపెన్ టెన్నిస్ సెరెనా, ముర్రే అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 29: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి సూపర్ స్టార్లు సెరెనా విలియమ్స్, ఆండీ ముర్రే అనూహ్యంగా నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ నాలుగోరౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనాపై స్వెత్లానా కుజ్నెత్సొవా 6-7, 6-1, 6-2 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. మొదటి సెట్‌లో తీవ్రంగా పోరాడి గెలిచిన సెరెనా మిగతా రెండు సెట్లలో అదే స్థాయిలో ఆడలేకపోయింది. కాగా, ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన కుజ్నెత్సొవా సెమీస్‌లో స్థానం కోసం ఎకతరీన మకరోవాను ఢీ కొంటుంది. మకరొవా నాలుగో రౌండ్‌లో ఎలెనా స్విటొలినాను 6-1, 6-4 స్కోరుతో చిత్తుచేసింది. విక్టోరియా అజరెన్కా 7-6, 7-6 ఆధిక్యంతో అతి కష్టం మీద గార్బినే ముగురుజాను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. జొహన్నా కొన్టా 6-2, 6-2 ఆధిక్యంతో మోనికా నికులెస్క్యూపై గెలిచింది.
పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రేకు మూడో రౌండ్‌లోనే చుక్కెదురైంది. అతనిపై గ్రిగన్ దిమిత్రోవ్ 6-7, 6-4, 6-3 ఆధిక్యంతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో టైటిల్ కోసం జరుగుతున్న రేసులో ముందు వరుసలో ఉన్న ముర్రే ఎవరూ ఊహించని విధంగా ప్రీ క్వార్టర్స్ కూడా చేరలేక వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, మిలోస్ రవోనిక్ 7-6, 6-4 ఆధిక్యంతో జాక్ సాక్‌ను, దామిర్ జుంహర్ 4-6, 6-1, 6-2 స్కోరుతో మిఖలయ్ కుకుష్కిన్‌ను ఓడించారు. గేల్ మోన్ఫిల్ 6-3, 6-4 తేడాతో పాబ్లో క్యూవెస్‌పై గెలుపొందడగా, నిక్ కిర్గియోస్ 6-4, 6-4 స్కోరుతో టిమ్ స్మిజెక్‌పై విజయాన్ని నమోదు చేశాడు. రాబర్టో బటిస్టా అగుట్ 2-6, 6-3, 7-6 తేడాతో జో విల్‌ఫ్రైడ్ సొంగాను ఓడించాడు. కెయ్ నిషికోరి 6-2, 6-2 తేడాతో అలెగ్జాండర్ డొల్గొపొలొవ్‌పై, ఆండ్రే కుజ్నెత్సోవ్ 2-6, 7-5, 6-0 తేడాతో ఆడ్రియన్ మనారియోపై విజయాలు సాధించారు.