క్రీడాభూమి

ప్రపంచ టి-20 ర్యాంకింగ్స్ టాప్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 29: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా టి-20 ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ విభాగంలో భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతను 871 పాయింట్లు సంపాదించగా, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ (803 పాయింట్లు), మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 762 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఫఫ్ డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా/ 741), అలెక్స్ హాలెస్ (ఇంగ్లాండ్/737), క్రిస్ గేల్ (వెస్టిండీస్/ 724), కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 718), హామిల్టన్ మసకజా (జింబాబ్వే/ 677), మహమ్మద్ షెజాద్ (అఫ్గానిస్తాన్/ 674), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా/ 664) ‘టాప్-10’ జాబితాలో నాలుగు నుంచి పది స్థానాలను ఆక్రమించారు.
టీం ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా ఖాతాలో 127 పాయింట్లు ఉండగా, న్యూజిలాండ్ 122 పాయింట్లతో రెండు, వెస్టిండీస్ 120 పాయింట్లతో మూడు స్థానాలను ఆక్రమించాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు చెరి 115 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానాన్ని పంచుకుంటున్నాయి. ఆస్ట్రేలియా (112), పాకిస్తాన్ (107), శ్రీలంక (105), అఫ్గానిస్తాన్ (81), బంగ్లాదేశ్ (74), స్కాట్‌లాండ్ (59 పాయింట్లు) వరుసగా ఐదు నుంచి పది స్థానాలను సంపాదించాయి.
టి-20 బౌలర్ల విభాగంలో సామ్యూల్ బద్రీ (వెస్టిండీస్) 753 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్ 740 పాయింట్లతో రెండు స్థానాన్ని ఆక్రమించగా, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 725 పాయింట్లు సంపాదించి మూడో స్థానంలో నిలిచాడు. కేల్ అబోట్ (దక్షిణాఫ్రికా/ 671), ఆడం మిల్నే (న్యూజిలాండ్/ 648), రవీంద్ర జడేజా (్భరత్/ 645), జేమ్స్ ఫాల్క్‌నెర్ (ఆస్ట్రేలియా/ 641), మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్/ 638), మిచెల్ మెక్‌క్లీనగన్ (న్యూజిలాండ్/ 638) ‘టాప్-10’ జాబితాలో వరుసగా నాలుగు నుంచి పది వరకూ స్థానాలు సంపాదించారు.
ఆల్‌రౌండర్ల విభాగంలో షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) 373, షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) 346, షహీద్ అఫ్రిదీ (పాకిస్తాన్) 332 పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగు నుంచి పది స్థానాల్లో జేమ్స్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా/ 329), మార్లొన్ సామ్యూల్స్ (వెస్టిండీస్/ 276), మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్/ 274), యువరాజ్ సింగ్ (్భరత్/ 273), డ్వెయిన్ బ్రేవో (వెస్టిండీస్/ 268), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక/ 257) ఉన్నారు.