క్రీడాభూమి

గుండెపోటుతో మృతి చెందిన సైక్లిస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గెన్ట్ (బ్లెజయం), మార్చి 29: గెంట్ వెవెల్గెమ్ క్లాసిక్ రేస్‌లో పోటీపడిన స్థానిక సైక్లిస్టు ఆంటోనీ డిమోటీ గుండె పోటుతో మృతి చెందాడు. పీటర్ సగాన్ విజయం సాధించిన ఈ రేసు జరుగుతున్నప్పుడు ఒకానొక దశలో కొంత మంది సైక్లిస్టులు ఒకరినొకరు ఢీకొన్నారు. ఈ సంఘటనలో డిమోటీసహా చాలా మంది కిందపడ్డారు. మిగతా వారు చిన్నపాటి గాయాలతో బయటపడగా, 25 ఏళ్ల డిమోటీ గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటి వరకూ తీవ్రంగానే పోటీపడిన అతను హఠాత్తుగా మృతి చెందాడన్న వార్త అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.