క్రీడాభూమి

ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ సైనా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: సిరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సహచర క్రీడాకారిణి తన్వీ లాడ్‌ను 21-7, 21-13 తేడాతో ఓడించిన భారత్ సూపర్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. అయితే, పురుషుల సింగిల్స్‌లో హైదరాబాదీ కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలై నిష్క్రమించాడు. అతనిని ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనలిస్టు తియాన్ హౌవెయ్ 21-13, 17-21, 24-22 తేడాతో ఓడించాడు. కాగా, ఇటీవల కాలంలో కాలి మణికట్టు గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సైనా ఫిట్నెస్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడమే తన లక్ష్యమని పేర్కొంది. మ్యాచ్ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రియో ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని, ఫిట్నెస్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. ఫామ్ గురించి తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అయితే, ఫిట్నెస్ సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో భారత యువ ఆటగాడు సాయి ప్రణీత్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. సోనీ ద్వి కున్కొరోను ఢీకొన్న అతను 20-22, 12-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. అజయ్ జయరామ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతనిపై మార్క్ జిబ్లెర్ 21-12, 13-21, 21-19 ఆధిక్యంతో గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్, ప్రణవ్ జెర్రీ చోప్రా జోడీ 21-17, 21-16 తేడాతో అర్జున్ కుమార్, సంతోష్ రావూరి జోడీపై గెలిచింది. అదే విధంగా మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 21-13, 21-13 స్కోరుతో వినీత్ మానెల్, సంజీత్ జోడీపై విజయం సాధించింది. ఇలావుంటే, పురుషుల డబుల్స్‌లో అల్విన్ ఫ్రాన్సిస్, కోన తరుణ్ జోడీతోపాటు వెంకటేష్ అరోరా, విజయ్ కుమార్ సింగ్ జోడీ కూడా తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌లో అపర్ణా బాలన్, ప్రజాక్తా సావంత్ జోడీకి మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది.