క్రీడాభూమి

మహిళల టి-20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: టి-20 వరల్డ్ కప్ పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికీ, మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరి అభిమానులకు ఊరటనిచ్చింది. బుధవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన సెమీ ఫైనల్‌లో ఈ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేయగలిగింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడి, 55 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వికెట్‌కీపర్ ఎలిసా హీలీ 25, ఎలిస్ విల్లే 19 చొప్పున పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో నతాలీ షివర్ 22 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. లారా మార్ష్, జెన్నీ గన్ చెరొక వికెట్ కూల్చారు.
ఫైనల్ చేరేందుకు 133 పరుగులు సాధించాల్సి ఉండగా, ఇంగ్లాండ్‌కు కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ (31), టామీ బ్యూవౌంట్ (32) శుభారంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు వీరు 67 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ విజయానికి పునాదులు పడ్డాయని అభిమానులు ఆశించారు. కానీ వీరితోపాటు టాప్ ఆర్డర్‌లోని సారా టేలర్ (21) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. చేయాల్సిన రన్‌రేట్‌కు చాలా వెనుకబడింది. చివరిలో డానియెల్ వ్యాట్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, కాథెరిన్ బ్రంట్ 11 పరుగులు చేసింది. కానీ, వారి శ్రమ వృథాకాగా, ఇంగ్లాండ్ ఐదు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగాన్ షట్ 15 పరుగులకే రెండు వికెట్లు సాధించింది. ఎలిస్ పెర్రీ, రెన్ ఫారెల్, క్రిస్టెన్ బిన్స్, ఎరిన్ ఒస్బోర్న్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 (అలిసా హీలీ 25, మెగ్ లానింగ్ 55, ఎలిస్ విల్లే 19, నతాలీ షివర్ 2/22).
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 (చార్లొట్ ఎడ్వర్డ్స్ 31, టామీ బ్యూవౌంట్ 32, సారా టేలర్ 21, డానియెల్ వ్యాట్ 10 నాటౌట్, మెగాన్ షట్ 2/15).

మియామీ ఓపెన్ టెన్నిస్
సెమీస్‌కు కుజ్నెత్సొవా
మియామీ, మార్చి 30: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల నాలుగో రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసిన స్వెత్లానా కుజ్నెత్సొవా క్వార్టర్ ఫైనల్స్‌లోనూ అదే దూకుడును కొనసాగించింది. బలమైన ప్రత్యర్థి ఎకతరీన మకరోవాను ఆమె 6-7, 6-4, 6-3 తేడాతో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో తిమియా బసిన్స్‌స్కీ కూడా గెలుపొంది, సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆమె క్వార్టర్స్‌లో సిమోనా హెలెన్‌ను 4-6, 6-3, 6-2 ఆధిక్యంతో ఓడించింది. మొదటి రెండు క్వార్టర్ ఫైనల్స్‌లోనూ విజేతలు తొలి సెట్‌ను చేజార్చుకొని, ఆతర్వాత రెండు సెట్లను గెలవడం విశేషం.
క్వార్టర్స్ చేరిన జొకొవిచ్
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. అతను నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 14వ సీడ్ డొమినిక్ తియెమ్‌ను 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. జపాన్ ఆటగాడు, ఆరో సీడ్ కెయ్ నిషికోరి 6-2, 6-4 స్కోరుతో రాబర్టొ బటిస్టా అగుట్‌ను, థామస్ బెర్డిచ్ 6-4, 3-6, 7-5 స్కోరుతో రిచర్డ్ గాస్కెట్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. మిలోస్ రవోనిక్ 6-0, 6-3 తేడాతో డామిర్ జుంహర్‌పై గెలవగా, డేవిడ్ గోఫిన్ 7-6, 6-3 ఆధిక్యంతో హొరాసియో జెబలోస్‌ను ఓడించాడు. గేల్ మోన్ఫిల్స్ 6-7, 6-3, 6-3 తేడాతో గ్రిగర్ దిమిత్రోవ్‌పై విజయం సాధించాడు. గిల్స్ సైమన్ 6-0, 6-1 తేడాతో లుకాస్ పౌలీపై, నిక్ కిర్గియోస్ 7-6, 6-3 స్కోరుతో ఆండ్రీ కుజ్నెత్సోవ్‌పై విజయాలను నమోదు చేసి, క్వార్టర్స్‌లో స్థానం సంపాదించారు.