క్రీడాభూమి

యువీ అన్‌ఫిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 30: కాలి మడమ గాయంతో బాధపడుతున్న భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురువారం వెస్టిండీస్‌తో జరిగే టి-20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆడడం లేదు. మొహాలీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని కాలు బెణికింది. అతను పూర్తిగా కోలుకోలేదని, ఫిట్నెస్ లేనందున అతను ఈ టోర్నీలో కొనసాగడం అనుమానంగానే కనిపిస్తున్నది. గురువారం నాటి మ్యాచ్‌లో యువీ ఆడడం లేదని భారత జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని ఈవెంట్ టెక్నికల్ కమిటీ సమావేశమై యువీ ఫిట్నెస్ సమస్యపై తమకు సమాచారం అందినట్టు ప్రకటించింది. అతని స్థానంలో మనీష్ పాండేను జట్టులోకి తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది జూలై మాసంలో హరారేలో జింబాబ్వేపై పాండే రెండు టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి, ఐదో వనే్డ ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన అతను సెంచరీతో రాణించాడు. హార్డ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, అతను యువీ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేస్తాడని అనుకోవడానికి వీల్లేదు. మొత్తం మీద తాజా పరిణామం భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది.
సిమన్స్ కూడా..
భారత్ మాదిరిగానే వెస్టిండీస్‌ను కూడా ఫిట్నె సమస్య వేధిస్తున్నది. ఆ జట్టు బ్యాట్స్‌మన్ లెండల్ సిమన్స్ గాయం కారణంగా భారత్‌తో గురువారం జరిగే సెమీ ఫైనల్‌లో ఆడే అవకాశం కనిపించడం లేదు. ఇలావుంటే, భారత్‌తో జరిగే సెమీస్‌కు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్టు విండీస్ కెప్టెన్ డారెన్ సమీ చెప్పాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ కొంత మంది ఆటగాళ్ల ఫిట్నెస్ స్థాయ ఆందోళనకరంగా ఉందని అంగీకరించాడు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ విరాట్ కోహ్లీని చూసి తాము బెదిరిపోవడం లేదని స్పష్టం చేశాడు.
మ్యాచ్ గురువారం రాత్రి
7 గంటలకు మొదలవుతుంది.