క్రీడాభూమి

ఫైనల్‌కు వెస్టిండీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 31: మహిళల టి-20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన కివీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయగలిగింది. బ్రిట్నీ కూపర్ 61 పరుగులు సాధించి, వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రతిభ కారణంగానే విండీస్ 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును సాధించగలిగింది. ఆమెనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా, స్ట్ఫానీ టేలర్ 26 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి, కెప్టెన్ స్థానానికి న్యాయం చేసింది.
న్యూజిలాండ్ కెప్టెన్ సూజీ బేట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 18 పరుగుల స్కోరువద్ద హీలీ మాథ్యూస్ (16) వికెట్‌ను కోల్పోయింది. స్ట్ఫానీ టేలర్ 25 పరుగులు సాధించగా, కూపర్ 48 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 61 పరుగులు సాధించింది. దియేంద్ర డోటిన్ (20), మారిసా అగ్లేయిరా (15 నాటౌట్) కూడా తమ వంతు సాయం చేయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్ 22 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టింది.
ఫైనల్ చేరేందుకు 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ 11 పరుగుల వద్ద రాచెల్ ప్రీస్ట్ (6) వికెట్‌ను కోల్పోయింది. సోఫీ డివైన్ 22 పరుగులకు పెవిలియన్ చేరాగా కెప్టెన్ సుజీ బేట్స్ 17 బంతుల్లో 17 పరుగులు సాధించి వెనుదిరిగింది. అనంతరం సారా మెక్‌గ్లాషన్ (29 బంతుల్లో 24 పరుగులు) కొంత సేపు పోరాటం జరపగా, కాటీ మార్టిన్ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వికెట్లు కూలుతాయన్న భయంతో అతి జాగ్రత్తకు పోయిన విండీస్ ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్ట్ఫానీ టేలర్ మూడు వికెట్లు పడగొట్టగా, షమిలియా కానెల్, అఫీ ఫ్లెచర్, షకానా క్వింటైన్ తలా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఏప్రిల్ మూడున కోల్‌కతాలో జరిగే ఫైనల్‌లో ఈ జట్టు ఆస్ట్రేలియాను ఢీ కొంటుంది. మొదటి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచిన విషయం తెలిసిందే.

చిత్రం కోల్‌కతాలో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి మహిళల టి-20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో వెస్టిండీస్ క్రీడాకారిణుల స్టెప్పులు