క్రీడాభూమి

టీమిండియా నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 31: బ్యాటింగ్‌కు అనుకూలించిన మొహాలీ పిచ్‌పై టీ మిండియా బొల్తా కొట్టింది. కోట్లాది మంది అభిమానులను నిరాశపరచిం ది. సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం భార త్‌ను నిలువునా ముంచేసింది. ఏమాత్రం ఆసక్తిని రేపకుండా చప్పగా సాగి న సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించగా, టైటిల్ ఫేవరిట్ భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్వదేశంలో జరుగు తున్న టి-20 వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్ కూడా చేరుకోలేకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. లెండల్ సిమన్స్ 83, ఆండ్రె రసెల్ 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, విం డీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
లక్ష్యాన్ని నిర్దేశించడం కంటే ఛేదించడమే సులభమన్న ఉద్దేశంతో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, ఆజింక్య రహానే ధాటిగా ఆరంభించి, మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. 31 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 43 పరుగులు చేసిన రోహిత్‌ను సామ్యూల్ బద్రీ ఎల్‌బిగా అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీతో కలిసి రహానే స్కోరుబోర్డును ముందుకు దూకించాడు. డ్వెయిన్ బ్రేవో బౌలింగ్‌లో రహానే సింగిల్ తీయడం ద్వారా, 12.2 ఓవర్లలో భారత్ వంద పరుగుల మైలురాయిని చేరింది. మొత్తం మీద వీరిద్దరూ రెండో వికెట్‌కు 8.1 ఓవర్లలో 66 పరుగులు జోడించారు. ఆండ్రె రసెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే 40 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద డ్వెయిన్ బ్రేవో క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. 35 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో రెండు ఫోర్లు ఉన్నాయి.
కోహ్లీ హాఫ్ సెంచరీ
టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నుముకగా మారిన కోహ్లీ మరోసారి అసాధారణ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 33 బంతుల్లో అతను అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో అతను 50 లేదా అంతకు మించి పరుగులు చేయడం ఇది 16వ సారి. ప్రపంచంలో మరే ఇతర బ్యాట్స్‌మన్ ఈ ఫీట్ సాధించలేదు. క్రిస్ గేల్, బ్రెండ్ మెక్‌కలమ్ చెరి 15 పర్యాయాలు యాభై లేదా అంతకు మించిన పరుగులు చేశారు. వారి రికార్డును కోహ్లీ అధిగమించాడు. కాగా, భారత బ్యాటింగ్‌లో మొదటి ముగ్గురు టాప్ ఆర్డర్ ఆటగాళ్లు 40కి మించి పరుగులు చేయడం విశేషం. టీమిండియాకు ఈ విధంగా టాప్ త్రీ బ్యాట్స్‌మెన్ నలభైకి మించి పరుగులు అందించడం ఇది మూడోసారి. ధోనీ, కోహ్లీ కలిసి 20 ఓవర్లలో భారత స్కోరును రెండు వికెట్లకు 192 పరుగులకు చేర్చారు. ధోనీ 9 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్‌తో 15 పరుగులు చేశాడు. కోహ్లీ 47 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
నిరాశ పరచిన గేల్
కోహ్లీ వీరవిహారం చేసిన నేపథ్యంలో, అదే స్థాయిలో విరుచుకుపడతాడని అనుకున్న విండీస్ వీరుడు క్రిస్ గేల్ నిరాశ పరిచాడు. ఐదు పరుగులు చేసిన అతను జస్‌ప్రీత్ బుమ్రా వేసిన బంతిని లాఫ్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. అది బ్యాట్ కింది భాగాన్ని తగులుతూ స్టంప్స్‌ను పెకళించడంతో గేల్ నిష్క్రమించాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మార్లొన్ సామ్యూల్స్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. అతను ఎనిమిది పరుగులు చేసి, ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో ఆజింక్య రహానేకు దొరికిపోయాడు. 19 పరుగుల వద్ద విండీస్ రెండో వికెట్ చేజార్చుకుంది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించిన లెండల్ సిమన్స్ క్రీజ్‌లో నిలదొక్కుకున్న జాన్సన్ చార్లెస్‌తో కలిసి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. చార్లెస్ 32 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను మూడో వికెట్‌కు 10.1 ఓవర్లలో సిమన్స్‌తో కలిసి 97 పరుగుల జోడించాడు. రవీంద్ర జడేజా భారీగా పరుగులు సమర్పించుకున్న తరుణంలో కోహ్లీని రంగంలోకి దింపిన ధోనీ ప్రయోజం సఫలమైంది. మొదటి బంతిలోనే చార్లెస్ వికెట్‌ను సాధించాడు. 36 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 పరుగులు చేసిన అతను రోహిత్ శర్మ క్యాచ్ అందుకోగా కోహ్లీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాగా సిమన్స్ 35 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించాడు. అతనికి వరుసగా ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆండ్రె ర సెల్‌తో కలిసి అతను నాలుగో వికెట్‌కు 6.3 ఓవర్లలో అజేయంగా 80 పరుగు లు జోడించి, విండీస్‌ను గెలిపించాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగా విండీస్ లక్ష్యాన్ని ఛేదించింది. అప్పటికీ సిమన్స్ 83 (51 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రసెల్ 43 (20 బంతులు, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) నాటౌట్‌గా ఉన్నారు.
బౌలర్ల వైఫల్యం
టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడని తెలిసి కూడా అతనితో ఓ వర్ల కోటాను పూర్తి చేయడంలో ధోనీ ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావ డం లేదు. జడేజా ఏకంగా సగటున 12 పరుగులు ఇచ్చాడు. ఆశిష్ నెహ్రా ఒక్క డే సంయమనంతో బంతులు వేసి, సగటున 6.25 పరుగులిచ్చాడు. అతనితో పాటు కోహ్లీ మాత్రమే కొంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిగతా వారంతా ఓవర్‌కు సగటున 10కి మించి పరుగులు విండీస్‌కు ధారాదత్తం చేశారు. అశ్విన్ సైతం విఫలమై, రెండు ఓవర్లలో 20 పరుగులు ఇవ్వడం విచిత్రం. జడేజా 48, బుమ్రా 42, పాండ్య 43 చొప్పున పరుగులిచ్చారు.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ ఎల్‌బి సామ్యూల్ బద్రీ 43, ఆజింక్య రహానే సి డ్వెయిన్ బ్రేవో బి అండ్రె రసెల్ 40, విరాట్ కోహ్లీ 89 నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ 15 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 192.
వికెట్ల పతనం: 1-62, 2-128.
బౌలింగ్: రసెల్ 4-0-47-1, సామ్యూల్ బద్రీ 4-0-26-1, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 4-0-38-0, సులేమాన్ బెన్ 4-0-36-0, డ్వెయిన్ బ్రేవో 4-0-44-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: క్రిస్ గేల్ బి జస్‌ప్రీత్ బుమ్రా 5, జాన్సన్ చార్లెస్ సి రోహిత్ శర్మ బి విరాట్ కోహ్లీ 52, మార్లొన్ సామ్యూల్స్ సి ఆజింక్య రహానే బి ఆశిష్ నెహ్రా 8, లెండల్ సిమన్స్ 83 నాటౌట్, రసెల్ 43 నాటౌట్,ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు 196).
వికెట్ల పతనం: 1-6, 2-19, 3-116.
బౌలింగ్: నెహ్రా 4-0-25-1, బుమ్రా 4-0-42-1, జడేజా 4-0-48-0, అశ్విన్ 2-0-20-0, హార్దిక్ పాండ్య 4-0-43-0, కోహ్లీ 1.4-0-15-1.

చిత్రం వెస్టిండీస్ టాప్ స్కోరర్
లెండల్ సిమన్స్
(51 బంతుల్లో 83 పరుగులు)