క్రీడాభూమి

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అలన్ బోర్డర్ మెడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 12: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏడాది కాలంలో రెండోసారి అలెన్ బోర్డర్ మెడల్ దక్కించుకున్నాడు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నాడు. ఆ దేశ గొప్ప ఆటగాడు డోనాల్డ్ బ్రాడ్‌మన్ తర్వాత అంతటి ఘనతను సాధించినవారిలో స్టీవ్ స్మిత్ రెండోవాడు. ఇతనికి 246 ఓట్లు వచ్చాయి. డేవిడ్ వార్నర్‌కు 162 ఓట్లు, నాథన్ లియాన్‌కు 156 ఓట్లు దక్కాయి. 2015లో తొలిసారిగా అలెన్ బోర్డర్ మెడల్‌ను స్టీవ్ స్మిత్ దక్కించుకున్నాడు. 24 అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు టెస్టు క్రికెట్‌లో 1754 పరుగులు సాధించాడు. వీటిలో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా ఉన్నకాలంలో భారత్‌తో సిరీస్ ఆడినా ఓటమిని మూటకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ డ్రా కాగా, స్వదేశీ గడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెష్ టోర్నీలో ఘన విజయం సాధించాడు.

చిత్రం.. డేవిడ్ వార్నర్