క్రీడాభూమి

ఫిగర్ స్కేటింగ్ విజేత కెనడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంగ్‌న్యూంగ్ (దక్షిణ కొరియా), ఫిబ్రవరి 12: వింటర్ ఒలింపిక్స్‌కు పయాంగ్‌చాంగ్‌తో కలిపి ఆతిథ్యమిస్తున్న గాంగ్‌న్యూంగ్‌లో సోమవారం జరిగిన ఫిగర్ స్కేటింగ్ టీం చాంపియన్‌షిప్‌ను కెనడా గెల్చుకుంది. ఈ జట్టులో పాట్రిక్ చాన్, కేట్లీ నొమాన్డ్, గాబ్రియెల్ డేల్మన్, మెగాన్ డహామెల్/ ఎరిక్ రాడ్‌ఫోర్డ్, టెస్సా వర్ట్యూ/ స్కాట్ మోయిర్ సభ్యులుగా ఉన్నారు. కాగా, డోపింగ్ కేసుల కారణంగా రష్యా సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటుండగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పతాకంపై పోటీ చేస్తున్న ఆ దేశ ఫిగర్ స్కేటింగ్‌లో రజత పతకం లభించింది. కాంస్య పతకాన్ని రష్యా జట్టు అందుకుంది.

డహిమెయర్‌కు డబుల్
మహిళల బయథ్లాన్‌లో జర్మనీకి చెందిన లారా డహిమెయర్ రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంతకు ముందు స్ప్రింట్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన ఆమె సోమవారం నాటి పర్య్సూట్‌లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. 30:35.3 నిమిషాల్లో ఆమె లక్ష్యాన్ని పూర్తి చేయగా, స్లోవేకియా స్టార్ అనస్టాసియా కుజ్మినా 31:04.7 నిమిషాలతో రజత పతకాన్ని అందుకుంది. అనైస్ బెస్కార్డ్ (ఫ్రాన్స్)కు కాంస్య పతకం లభించింది. కాగా, పురుషుల పర్య్సూట్‌లో మార్టిన్ ఫోర్కేడ్ (ఫ్రాన్స్) 32:51.7 నిమిషాలతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. సెబాస్టియన్ శామ్యూల్సన్ (స్వీడన్/ 33:03.7 నిమిషాలు), బెనెడిట్ డాల్ (జర్మనీ/ 33.06.8 నిమిషాలు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.