క్రీడాభూమి

బార్సిలోనాకు గటాఫ్ బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఫిబ్రవరి 12: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగా గ్రూప్ దశలో ఇప్పటి వరకూ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న బార్సిలోనా దూకుడుకు గటాఫ్ బ్రేక్ వేసింది. బలమైన జట్టు కాకపోయినప్పటికీ, వ్యూహాత్మకంగా ఆడిన గటాఫ్ తన ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. లూయిస్ సొరెజ్ ఒకటిరెండు సార్లు గోల్ పోస్టుకు సమీపానికి వెళ్లినప్పటికీ, గటాఫ్ రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయాడు. ఈ సీజన్‌లో ఇంత వరకూ 23 మ్యాచ్‌లు ఆడిన బార్సిలోనా ఒక్క పరాజయాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే, గటాఫ్ వంటి జట్టుపై విజయాన్ని నమోదు చేయలేకపోవడం బార్సిలోనా అభిమానులను నిరాశకు గురి చేసింది.