క్రీడాభూమి

ట్వంటీ-20 సిరీస్‌పై భారత మహిళల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా, ఫిబ్రవరి 12: దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన మూడు వనే్డలలో రెండింటిలో గెలుపుతో మంచి ఊపు మీదున్న భారత మహిళా క్రికెట్ జట్టు ఇపుడు అదే టీమ్‌తో జరిగే ఐదు ట్వంటీ-20లపై దృష్టి సారించింది. మంగళవారం నుండి జరిగే ఈ మ్యాచ్‌లలో సత్తా చూపేందుకు ఇరుజట్లు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మూడు వనే్డలకు భారత జట్టుకు మిథాలీరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించగా, ట్వంటీ-20లలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంథాని వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రెండు వనే్డలలో భారత్ 88, 178 పరుగుల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించినా, మూడో వనే్డలో మాత్రం ఓడిపోయింది. చివరి వనే్డలో ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందకుండా ఐదు ట్వంటీ-20లపై దృష్టి కేంద్రీకరించింది. టీ-20 స్పెషలిస్టులుగా పేరుగాంచిన అనుజా పాటిల్, ఆల్‌రౌండర్ రాధా యాదవ్, వికెట్ కీపర్ నుజ్‌హత్ పర్వీన్ భారత్‌కు బలమైన ఆయుధాలు. అదేవిధంగా అండర్-19 గేమ్స్‌లో 163 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేసిన ముంబయికి చెందిన 17 ఏళ్ల జమీమా రోడ్రిగ్స్ కూడా టీ-20 బృందంలో కీలక సభ్యురాలిగా ఉండడంతో జట్టుకు కలిసివచ్చే అంశం. మూడో వనే్డలో 79, 56 పరుగులతో అలరించిన దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి చిన్న ఫార్మాట్లలో బాగా రాణించగలరనే ఆత్మవిశ్వాసం ఉంది. భారత్‌ను వంటి చేత్తో నడిపించగల సత్తా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్‌లకే సొంతం. ఇక బౌలింగ్‌లో మూడో వనే్డలో విశ్రాంతి తీసుకున్న ప్రముఖ క్రికెటర్ జులన్ గోస్వామి ఇపుడు జరిగే టీ-20లలో ఆడే అవకాశం ఉంది. జులన్ గోస్వామి గత వనే్డలో లేకపోవడంతో భారత జట్టు బౌలింగ్‌ను ఎదుర్కొన్న ప్రత్యర్థి జట్టులో మిగ్‌నాన్ డు ప్రెజ్ 90 పరుగులు చేయడంతో ఆ జట్టు విజయం సాధించిన విషయం కాదనలేని సత్యం. దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షబ్నిమ్ ఇస్మైల్‌లను నమ్ముకుంది. ఇస్మైల్ ఆఖరి వనే్డలో 9 ఓవర్లలో 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించింది.

చిత్రం..భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్