క్రీడాభూమి

ఆధిపత్యానికి భారత్ తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, ఏప్రిల్ 12: దక్షిణాఫ్రికాపై ఆధిపత్యాన్ని కనబరచి, మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో మంగళవారం నాటి ఐదో వనే్డ ఇంటర్నేషనల్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ సిద్ధమైంది. ఆరు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్న భారత్, వర్షం కారణంగా పలు మార్లు ఆటకు అంతరాయం ఏర్పడిన నాలుగో వనే్డలో అనూహ్యంగా ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇంకా రెండు మ్యాచ్‌లను చేతిలో ఉండగా, వాటిలో గెలిస్తే తప్ప దక్షిణాఫ్రికాకు ఈ సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉండదు. అయితే, భారత్‌కు అలాంటి ప్రమాదం లేదు. ఈ రెండింటిలో ఏ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా, దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికా జట్టుపై మొట్టమొదటిసారి ఒక వనే్డ సిరీస్‌ను గెల్చుకొని చరిత్ర సృష్టిస్తుంది. చివరి మ్యాచ్ వరకూ ఆగకుండా, ఐదో వనే్డతోనే సిరీస్ ఫలితాన్ని ఖరారు చేయాలని భారత్ తహతహలాడుతున్నది. నాలుగో వనే్డలో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. తన వందో వనే్డ ఇంటర్నేషనల్‌లో శిఖర్ ధావన్ సెంచరీ చేయడం, కోహ్లీ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం నాలుగో వనే్డలో భారత బ్యాటింగ్ పటిష్టతను స్పష్టం చేశాయి. అయితే, మణికట్ట మాయాజలం ప్రదర్శించే యువ స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ మొదటి మూడు వనే్డల్లో మాదిరి అద్భుతాలను ప్రదర్శించలేకపోయారు. ఫలితంగా సవరించిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌లో ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ను చెలరేగకుండా భారత బౌలర్లు కట్టడి చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్‌పై అదే స్థాయిలో రాణించలేకపోయారు. ప్రత్యేకించి హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ విజృంభణకు టీమిండియా బౌలర్ల నుంచి సరైన సమాధానం లేకపోయింది. డెత్ ఓవర్లలో పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ సేవలను వినియోగించుకోకుండా, భారీగా పరుగులిస్తున్నప్పటికీ స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించిన కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా అందుకోవాలన్న ఉద్దేశంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ టీ-20 తరహాలో చెలరేగడం భారత బౌలింగ్‌కు శాపంగా మారింది.
ఫీల్డింగ్ వైఫల్యాలు
వర్షం, పసలేని బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా నాలుగో టీమిండియా ఓటమికి కారణమైంది. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ని పట్టలేకపోవడం, అతను ఔటైన బంతి నోబాల్ కావడం వంటి అంశాలు భారత్ పరాజయానిన శాసించాయి. చాహల్, కుల్దీప్ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలో బాగా అధ్యయనం చేసినట్టు కనిపించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ వ్యూహాత్మకంగా ఆడితే, భారత క్రికెటర్లు అందుకు భిన్నంగా తడబాటును ప్రదర్శించి, భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఈ పొరపాటు ఐదో మ్యాచ్‌లో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఐదో వనే్డలో తుది జట్టు కూర్పు కోసం భారత జట్టు మేనేజ్‌మెంట్ కసరత్తు చేయక తప్పదు. కాగా, కేప్ టౌన్ మ్యాచ్‌లో గాయపడిన కేదార్ జాధవ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అతని ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాధవ్ అందుబాటులో లేకపోతే, పార్ట్ టైమ్ బౌలర్‌గా హార్దిక్ పాండ్య మరోసారి సేవలు అందిస్తాడు. అయితే, అదనపు స్మిన్నర్‌గా సేవలు అందించే జాధవ్‌కు ఫాస్ట్ బౌలర్ పాండ్య ప్రత్యామ్నాయం కాదన్న వాదన కూడా వినిపిస్తున్నది. శ్రేయాస్ అయ్యర్ అప్పుడప్పుడు లెగ్ స్పిన్‌తో ఆకట్టుకునే సామర్థ్యం ఉన్నవాడే. కానీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతనికి గొప్ప అనుభవం ఏమీ లేదు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వనే్డల్లో అరంగేట్రం చేసిన అతను ఒక ఓవర్ వేశాడు. కాబట్టి, జాధవ్‌ను భర్తీ చేసే సామర్థ్యం అయ్యర్‌కు లేదనేది స్పష్టం.
నిలకడలేని రహానే!
అజింక్య రహానే నిలకడలేకుండా ఆడడం జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. వనే్డ జట్టులో మరోసారి స్థానం దక్కించుకున్న అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, 79 పరుగులు చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. అయితే, ఆతర్వాత రెండో మ్యాచ్‌ల్లో వరుసగా 11, 8 చొప్పున పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. ఎప్పుడు రాణిస్తాడో, ఎప్పుడు విఫలమవుతాడో తెలియని పరిస్థితుల్లో రహానేను కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపడానికి కోహ్లీ సందేహించడంలో తప్పులేదు. రహానే, పాండ్య స్థిరంగా ఆడకపోవడం వల్ల ఏర్పడిన లోటును మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమర్థంగా పూర్తి చేయడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఊరటనిస్తున్న అంశం. నాలుగో వనే్డలో 43 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేసిన ధోనీని మిడిల్ ఆర్డర్‌లో సమ్మకస్తుడు.
బ్యాటింగ్ బలంపైనే భారత్ ఎక్కువగా ఆధారపడిందనేది ఎవరూ కాదనలేని నిజం. మొదటి నాలుగు వనే్డల్లో కలిపి రోహిత్ శర్మ కేవలం 40 పరుగులే చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ రాణిస్తున్న కారణంగా అతని వైఫల్యాలపై ఎవరూ దృష్టి పెట్టలేదు. విరాట్ కోహ్లీ 393, శిఖర్ ధావన్ 271 చొప్పున పరుగులు చేసి, గత నాలుగు వనే్డల్లోనూ తమ బ్యాటింగ్ బలాన్ని దక్షిణాఫ్రికాకు రుచి చూపారు. అయితే, మిగతా ఆటగాళ్లంతా కలిసి చేసిన పరుగులు 239 మాత్రమే. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని, ప్రత్నామ్యాయాలను వెతుక్కోవాల్సిన అవసరం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవి శాస్ర్తీపై ఉంది. కోహ్లీ, ధావన్‌ను త్వరగా ఔట్ చేస్తే, ఆతర్వాత భారత్‌ను నియంత్రించడం దక్షిణాఫ్రికాకు ఏమాత్రం కష్టం కాదు. ఈ పరిస్థితుల్లో, ఐదో వనే్డను గెలవాలంటే, భారత ఆటగాళ్లు లోపాలను సవరించుకొని, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌ని గెలిచి భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందో లేక టీమిండియాను ఓడించి దక్షిణాఫ్రికా ఈ సిరీస్ చేజారకుండా మరో ప్రయత్నం చేస్తుందో చూడాలి.
చిత్రం..సహచరులతో కలిసి ధోనీ సెల్ఫీ