క్రీడాభూమి

చాంపియన్లుగా రైల్వేస్, సర్వీసెస్ జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 13: ఫెడరేషన్ కప్ కబడ్డీ పోటీలలో పురుషుల విభాగంలో సర్వీసెస్ జట్టు, మహిళల విభాగంలో ఇండియన్ రైల్వేస్ జట్టు చాంపియన్లుగా నిలిచాయి. రెండు విభాగాలలోనూ హోరాహోరీ జరిగిన పోటీల్లో ఆఖరి క్షణాల్లో పాయింట్లు సాథించిన ఇరు జట్లూ సంచలన విజయాలు నమోదు చేశాయి. సోమవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో కర్నాటక జట్టుతో తలపడిన సర్వీసెస్ జట్టు గట్టిపోటీని ఎదుర్కొంది. చివరకు 28-25 స్కోరుతో నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు మహిళల విభాగంలో హిమాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడిన ఇండియన్ రైల్వేస్ జట్లు నువ్వానేనా అన్న తీరులో తలపడ్డాయి. ఆఖరిక్షణంలో ప్రత్యర్థి జట్టు క్రీడాకారిణిని రైల్వేస్ జట్టు క్రీడాకారిణి పింకీరాయ్ కదలనివ్వకుండా పట్టుకోవడంతో గెలుపునకు అవసరమైన ఒక్క పాయింట్ రైల్వేస్ జట్టు సాధించి 26-25 స్కోరుతో కప్ కొట్టేసింది. విజేతలకు రూ. 2 లక్షలు, ఫైనల్స్‌లో ఓటమిపాలైన జట్లకు లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి ఇచ్చారు.
మహిళల విభాగంలో గత ఏడాది జాతీయ చాంపియన్‌గా నిలిచిన హిమాచల్ ప్రదేశ్ తన శక్తిసామర్థ్యాలను బలంగానే చాటుకుంది. నిజానికి ఒక దశలో ప్రత్యర్థిపై మొదటి అర్థ్భాగంలో 9-16 పాయింట్లతో వెనుకబడి సమయంలో హిమాచల్ జట్ల క్రీడాకారిణులు నిధి శర్మ, సారిక విజృంభించి ఆడి వరుసగా 9 పాయింట్లు సాధించి రైల్వేస్ జట్టుకు ముచ్చెమటలు పోయించారు. ఒత్తిడికి లోనైన ఆ జట్టు క్రీడాకారులు తప్పులు చేయడంతో హిమాచల్ వరుసగా పాయింట్లు సాధించగా ఆటముగిసే సమయానికి కొద్దిక్షణాల ముందు ఇరుజట్ల స్కోరు 25-25గా నిలిచింది. ఆ సమయంలో కోలుకొన్న రైల్వేస్ జట్టు ఒక పాయింట్ సాధించి విజయం సాధించింది. జాతీయ పోటీల్లో హిమాచల్ చేతుల్లో ఓడిపోయిన రైల్వేస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
పురుషుల విభాగంలో పోటీ ఎక్కువగా ఏకపక్షంగా సాగినప్పటికీ ఒకదశలో పోటాపోటీ పరిస్థితి ఎదురైంది. ఆట ప్రారంభమైన పదో నిమిషంలో సర్వీసెస్ జట్టు కర్నాటకపై 11-2 ఆధిక్యత సాధించింది. రెండో అర్ధ్భాగంలో పుంజుకున్న కర్నాటక 18-18తో స్కోరును సమం చేసింది. ఆ తరువాత రెండు జట్ల స్కోర్లు 24-24వద్దకు చేరుకున్నాయి. చివరి ఐదు నిమిషాల్లో ఆట అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఆ తరువాత సర్వీసెస్ జట్టు క్రీడాకారులు కర్నాటకకు అవకాశం ఇవ్వకుండా పాయింట్లు సాధించి విజయకేతనం ఎగరేశారు.