క్రీడాభూమి

రొనాల్డో ‘సెంచరీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఫిబ్రవరి 15: రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగీస్ సూపర్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో చాంపియన్స్ లీగ్‌లో సెంచరీ పూర్తి చేశాడు. నేమార్ వంటి సమర్థుడు ఉన్న పారిస్ జెయింట్ జర్మెయిన్‌తో ప్రీ క్వార్టర్స్ ఫస్ట్ లెగ్‌లో తలపడిన రియల్ మాడ్రిడ్ 3-1 తేడాతో విజయభేరి మోగించింది. నిజానికి మ్యాచ్ 33వ నిమిషంలోనే పారిస్ ఆటగాడు ఆడ్రియన్ రాబియోట్ గోల్ చేశాడు. అయితే, అతని ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఏడు నిమిషాల వ్యవధిలో పెనాల్టీని రొనాల్డో గోల్‌గా మార్చేసి, ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత ఇరు జట్లు పరస్పరం దాడులకు ఉపక్రమించగా గోల్స్ నమోదుకావడం అసాధ్యంగా కనిపించింది. 83వ నిమిషంలో రొనాల్డో రెండో గోల్ చేసి, రియల్ మాడ్రిడ్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. ఈ ఉత్సాహంతోనే మార్సెలో వియెరా మరో మూడు నిమిషాల్లోనే గోల్ సాధించాడు. రియల్ మాడ్రిడ్ 3-1 తేడాతో విజయం సాధించింది.
పోర్టో చిత్తు
మరో మ్యాచ్‌లో లివర్‌పూల్‌ను ఢీకొన్న పోర్టో ఫుట్‌బాల్ క్లబ్ 0-5 తేడాతో చిత్తయింది. లివర్‌పూల్ స్టార్ సాడియా మేన్ 25, 53, 85 నిమిషాల్లో గోల్స్ సాధించి, ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహమ్మద్ సలా, రాబర్టొ ఫిర్మినో చెరొక గోల్ చేయడంతో, లివర్‌పూల్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

చిత్రం.. క్రిస్టియానో రొనాల్డో