క్రీడాభూమి

టి-20 ప్రపంచ కప్‌లో ధోనీ రాణించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రపంచ టి-20 టోర్నమెంట్‌లో మహేంద్ర సింగ్ ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా రాణించిన తీరును గమనించినట్లయితే అతను భారత జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌ను మరి కొనే్నళ్లు కొనసాగించగలడనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డాడు. ‘టి-20లో అతను ఫామ్‌లో ఉన్నాడనే నేను అనుకుంటున్నాను. అంటే ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా అని అర్థం. టి-20లో అతను చాలా బాగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. టెస్టు కెప్టెన్‌గా అతను లేక పోవచ్చు గానీ ప్రపంచ టి-20లో అతను చాలా చక్కటి కెప్టెన్ అని నేను భావిస్తున్నాను’ అని చాపెల్ శుక్రవారం ఇఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్ఫో కార్యక్రమం ‘మ్యాచ్‌డే’లో అన్నాడు. గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలవడంతో టీమిండియా ప్రపంచ టి-20 టోర్నమెంట్‌నుంచి నిష్క్రమించడం తెలిసిందే. అయితే చాపెల్ మాత్రం భారత్ సాధించిన 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు జట్టు విజయం సాధించడానికి సరిపోయేదేనని అభిప్రాయ పడ్డాడు. 190 పరుగులకు పైగా లేదా ఓవర్‌కు 8 పరుగులకు పైగా సాధిస్తే ఎవరైనా సరే గెలుస్తామనే భావించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిన గేమ్‌లు పెద్దగా లేవు అని కూడా ఆయన అన్నాడు. అయితే గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో రవీంద్ర జడేజా బౌలింగ్ తీరును చాపెల్ విమర్శించాడు. చాలా సందర్భాల్లో జడేజా బంతిపై పట్టు కోల్పోయినట్లు కనిపించిందన్నాడు.

‘మియామీ’ సెమీస్‌లో నిషికోరి-కిర్గియోస్ పోరు
మియామీ, ఏప్రిల్ 1: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన కై నిషికోరి, ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిర్గియోస్ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ టోర్నీలో ఆరోసీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన నిషికోరి క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు చెందిన 16వ సీడ్ ఆడగాడు గేల్ మోన్‌ఫిల్స్‌పై చెమటోడ్చి విజయం సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో సరిగా రాణించలేక 4-6 తేడాతో తొలి సెట్‌ను చేజార్చుకున్న నిషికోరి ఆ తర్వాత పుంజుకుని విజృంభించాడు. ఫలితంగా 6-3, 7-6 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. కాగా, పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కిర్గియోస్ కెనడాకు చెందిన 12వ సీడ్ ఆటగాడు మిలోస్ రవోనిక్‌కు చెక్ పెట్టాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 24వ సీడ్ ఆటగాడు కిర్గియోస్ 6-4, 7-6 తేడాతో తనకంటే ఉన్నత ర్యాంకులో ఉన్న రవోనిక్‌పై సునాయాసంగా విజయం సాధించడం విశేషం.

ఫైనల్‌లో శివకు అపజయం
ఆసియా క్వాలిఫయర్స్‌లో రజత పతకం * ఒలింపిక్ బెర్తు సాధనలో దేవేంద్రో విఫలం

క్వియానన్ (చైనా), ఏప్రిల్ 1: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఈ ఏడాది జరిగే ఒలింపిక్ క్రీడలకు ఇప్పటికే బెర్తును ఖరారు చేసుకున్న అస్సాం యువ బాక్సర్ శివ థాపా (22) ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఆసియా/ఓషియానియా జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పురుషుల 56 కిలోల విభాగం ఫైనల్ బౌట్‌లో పరాజయాన్ని ఎదుర్కొని రజత పతకంతో పోరాటాన్ని ముగించాడు. ఇంతకుముందు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న శివ థాపా ప్రస్తుతం థాయిలాండ్‌కు చెందిన రెండో సీడ్ బాక్సర్, ఆసియా చాంపియన్ చచాయ్ బుదీతో జరిగిన ఫైనల్ బౌట్‌లో ఓటమి పాలయ్యాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ బౌట్‌లో బుదీ 3-0 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో శివ థాపా రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అయితే గురువారం జరిగిన సెమీ ఫైనల్ బౌట్‌లో శివ థాపా కజకిస్తాన్‌కు చెందిన కైరత్ యెరాలియెవ్‌ను ఓడించి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే అర్హత సాధించిన విషయం తెలిసిందే.
రెండో అవకాశాన్నీ చేజార్చుకున్న దేవేంద్రో
ఇదిలావుంటే, పురుషుల 49 కిలోల విభాగంలో భారత బాక్సర్ ఎల్.దేవేంద్రో సింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. కామనె్వల్త్ క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్న దేవేంద్రో సింగ్ గురువారం సెమీ ఫైనల్ బౌట్‌లో ఓటమి పాలవడంతో పాటు ఒలింపిక్ స్లాట్ కోసం శుక్రవారం నిర్వహించిన బౌట్‌లో కూడా పరాజయాన్ని ఎదుర్కొని రెండో అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. మంగోలియాకు చెందిన గాన్-ఎర్డెన్ గంఖుయాగ్‌తో జరిగిన ఈ పోరులో దేవేంద్రో సింగ్ 2-1 తేడాతో పోరాడి ఓడాడు.
తింగ్ లిన్‌తో నేడు మేరీ కోమ్ పోరు
కాగా, రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో ఇప్పటికే విఫలమైన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ మహిళల 51 కిలోల విభాగంలో శనివారం చైనీస్ తైపీకి చెందిన యు తింగ్ లిన్‌తో తలపడనుంది. వచ్చే నెల కజకిస్తాన్‌లో నిర్వహించే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే బాక్సర్లకు కొత్త ర్యాంకింగ్స్‌ను, సీడింగ్స్‌ను నిర్ణయించేందుకు ఈ పోటీని నిర్వహిస్తున్నారు.