క్రీడాభూమి

దక్షిణాఫ్రికాకు మరో పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహెనె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 17:దక్షిణాఫ్రికా జట్టుకు ఇది పరీక్షా సమయం. ఇటీవల జరిగిన వనే్డ సిరీస్‌లో భారత్ జట్టు చేతిలో 1-5 తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆ జట్టుతో 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో తలపడుతోంది. జోహెనె్నస్‌బర్గ్‌లోని బుల్‌రింగ్‌లో ఆదివారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడు హసిమ్ అమ్లా, వనే్డ జట్టు ప్రస్తుత కెప్టెన్ ఎడెన్ మర్కరమ్‌లకు ఆస్ట్రేలియా టూర్ నేపథ్యంలో సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా అనుభవజ్ఞుడైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జేపీ డుమినీకి సారధ్య బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ టీ-20 జట్టు కెప్టెన్ దుప్లెసిస్ గాయం కారణంగా దూరం కావడంతో డుమినీకి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. భారత్‌తో జరిగిన వనే్డ పోటీల్లో ఓటమి నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు డుమిని ప్రయత్నిస్తున్నారు. కొత్తముఖాలతో కూడిన తన జట్టులో స్ఫూర్తిని నింపాల్సి ఉందని, ఈ నేపథ్యంలో మరో ఆరుగురు యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోనున్నట్టు డుమిని ప్రకటించాడు. భారత్‌తో గట్టి పోటీ ఎదురవుతుందని తనకు తెలుసునని డుమినీ విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, తమ జట్టు సభ్యుల్లో ప్రతిభను వెలికి తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. ఆడిన అన్ని సిరీస్‌లు నెగ్గాలనేం లేదని, వనే్డ సిరీస్‌లో ఓటమివల్ల తమపై ఒత్తిడి పెరగిందనడం సరికాదని చెప్పాడు. దక్షిణాప్రికా పిచ్‌లు భారత స్పిన్నర్లకు అనుకూలించాయన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. చేతివేళ్లతో బంతిని తిప్పే స్పిన్నర్లకన్నా మణికట్టుతో బంతిని విసిరే స్పిన్నర్లు మరిన్ని వికెట్లు పడగొట్టగలరని డుమినీ అభిప్రాయపడ్డాడు. వనే్డల్లో చుక్కలు చూపి పరుగుల ప్రవాహం పారించిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కట్టడి చేయడానికి, త్వరగా ఔట్ చేయడానికి వ్యూహం రచించామని చెప్పిన డుమిని, వికెట్లు పడగొట్టడమే లక్ష్యమని, తరచూ వికెట్లు పడుతూంటే పరుగులు తగ్గుతాయని అన్నాడు. తమ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పైనే భారమంతా ఉందని డుమినీ చెప్పుకొచ్చాడు. టీ-20 సిరీస్‌లో అతడు కీలక భూమిక పోషిస్తాడని భావిస్తున్నట్లు చెప్పిన డుమిని తమ వ్యూహాలు ఎలా పనిచేస్తాయో వేచి చూడాలని అన్నాడు.