క్రీడాభూమి

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 17: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వనే్డలలో 5-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకోవడంతోపాటు కెప్టెన్‌గా 558 పరుగులు చేయడం, వీటిలో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీలు ఉండడం గొప్ప విషయం కాక మరేమిటని ఆయన అన్నాడు. కోహ్లీ సాధించిన ఘనత వేనోళ్ల కీర్తించదగినదని, అంటూ అతనిని క్రికెట్ క్రీడా ప్రపంచంలో అగ్రగణ్యులైన జో రూట్, విలియమ్సన్, స్టీవెన్ స్మిత్ సరసన రవి శాస్ర్తీ పోల్చాడు. జట్టులోని ప్రతిఒక్కరినీ కలుపుకుని అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ద్వారా ఘన విజయం సాధించేందుకు కోహ్లీ చేసిన కృషి అమోఘని ఆయన ప్రస్తుతించాడు. కోహ్లీ లాంటి యువ బ్యాట్స్‌మన్ సహకారం అన్నివిధాల సంపూర్ణంగా పుష్కలంగా లభిస్తుండడం వల్లే జట్టు అఖండ విజయాలను నమోదు చేసుకుంటోందని, దీనిని చూసిన తాను జట్టుకు మాజీ కెప్టెన్‌గా ఎంతో సంబరపడుతున్నానని అన్నాడు. వనే్డలలో కోహ్లీ తన సహచరులకు అందించిన సహకారం ఎంతో గొప్పదని, దీనివల్లే జట్టు అంతటి అఖండ విజయాన్ని నమోదు చేసుకుందని అన్నాడు. జట్టులోని స్పిన్నర్ల ద్వయం కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ వంటివారు మిడిల్ ఓవర్లలో తమ అద్భుత ఆటతీరుతో రాణించిన తీరు ప్రశంసనీయమని అన్నాడు. ఇలాంటి ఘటనలను కొనే్నళ్ల తర్వాత మళ్లీ ఇపుడు చూశామని ఆయన వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి వికెట్లను టపటపా తీసిన స్పిన్నర్ల ద్వయాన్ని అభినందించాడు. అదేవిధంగా జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా ఒక ఆయుధంలా జట్టుకు ఉపయోగపడ్డాడని, బుమ్రా ప్రపంచ శ్రేణి అన్ని ఫార్మాట్లలో మంచి గుర్తింపు సాధించాడని అన్నాడు.