క్రీడాభూమి

కోహ్లీసేన ఆట తీరు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 19: కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఆటగాళ్లపై మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ ప్రశంసల వర్షం కురిపించాడు.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన భారత్ పుంజుకుని తమ సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని నిరూపించి వనే్డ సిరీస్‌ను గెలుచుకోవడంలో కోహ్లీ, అతడి సహచరులు చూపిన పోరాటపటిమ అద్భుతమని మాజీ వికెట్‌కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు. దక్షిణాఫ్రికాలోని విభిన్నమైన వాతావరణానికి అలవాటుపడటానికి భారతజట్టుకు సమయం పట్టిందని, అందువల్లే టెస్టు సిరీస్‌ను కోల్పోయిందని, అయితే ఆ ఓటమితో నిరాశ చెందకుండా పుంజుకుని అసమాన ప్రతిభతో వనే్డ సిరీస్‌ను కోహ్లీసేన నెగ్గడం గొప్ప విషయమని ఆయన అన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటన సందర్భంగా 2-1 తేడాతో ఓడిపోయిన భారత జట్టు వనే్డల్లో 5-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలను ఆయన కొట్టిపారేశారు. అనేక సందర్భాల్లో జట్టును విజయతీరాలకు చేరిన్చ ధోనీ కీపింగ్, బ్యాటింగ్‌లలో తనదైన ముద్రవేశాడని కిర్మాణీ మెచ్చుకున్నారు.