క్రీడాభూమి

‘స్టార్ ఇండియా’కే ఐపీఎల్ ప్రసార హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తోపాటు దేశంలో 2018-19 సీజన్‌లో జరిగే జాతీయ క్రికెట్ పోటీల ప్రసార హక్కులను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కులను కైవసం చేసుకున్న స్టార్‌కు ఇది మరో విజయం. ఐపీఎల్ సీజన్‌లో జరిగే అన్ని పోటీలు, దేశీయ క్రికెట్ పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రతిపాదనలను బీసీసీఐ ఆహ్వానించింది. కాగా ఆ హక్కులను స్టార్ ఇండియా దక్కించుకుందని బీసీసీ ప్రస్తుత కార్యదర్శి అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఎంతమొత్తానికి ఒప్పందం కుదిరిందన్నది వెల్లడించలేదు. ఐపీఎల్ 2018, దేశీయ క్రికెట్ 2018-19 సీజన్‌లకు మాత్రమే ఈ ఒప్పందం వర్తిస్తుంది. అయితే దీనిని పొడిగించే అధికారం బీసీసీఐకు ఉంది. ఇప్పటికే ఐపీఎల్ టీవీ, డిజిటల్, ఇండియా, గ్లోబల్ మీడియా హక్కులను వచ్చే ఐదు సీజన్‌లకు దక్కించుకుంది. దీని విలువ 16,347.50 కోట్లు. సోనీ, ఫేస్‌బుక్, భారతి ఎయిర్‌టెల్ వంటి సంస్థలతో పోటీపడి స్టార్ ఈ హక్కులను పొందింది.