క్రీడాభూమి

ఓటమి ఓ గుణపాఠం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్సస్‌బర్గ్, ఫిబ్రవరి 19: భారత్‌తో జరిగే తదుపరి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో తమకు బ్యాటింగ్ ఖచ్చితంగా కలిసివస్తుందని దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ జేపీ డుమినీ అన్నాడు. భారత్‌తో ఆదివారం జరిగిన టీ-20 తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడం ద్వారా బ్యాట్స్‌మెన్‌లు, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు తమ ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. షార్ట్ ఫార్మాట్‌లలో దురదృష్టం తమను వెన్నాడుతోందని, ఇప్పటికే ఇది భారత్‌తో జరిగిన వివిధ మ్యాచ్‌ల సందర్భంగా పునరావృతమైందని అన్నాడు. మళ్లీ అవే తప్పులు పదేపదే దొర్లకుండా తమ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకుంటారనే నమ్మకం తనకు ఉందని అన్నాడు. టీ-20 తొలి మ్యాచ్‌లో భారత్ 204 పరుగులు చేసింది. లక్ష్యసాధనకు దిగిన దక్షిణాఫ్రికా దానిని ఛేదించలేక 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో తమ తరపున జరిగిన తప్పులను మననం చేసుకున్నామని, తదుపరి మ్యాచ్‌లలో ఏవిధంగా ఆడాలో అన్నదానిపై దృష్టి సారించనున్నామని పేర్కొన్నాడు. బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో తమకు అనుకూల అంశాలు కలిసి వస్తాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు. జీవితంలో ఒడిదుడుకులు సహజమని, సీనియర్ లేదా జూనియర్ క్రీడాకారులెవరైనా ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఓటమి నేర్పిన పాఠంతో ముందుకుపోవడమే క్రీడాకారుడి ఉన్నత ధ్యేయమని అన్నాడు. తమ జట్టులో భారత్ బ్యాట్స్‌మన్ భువనేశ్వర్ కుమార్ విసిరిన షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో తాము విఫలమైన విషయాన్ని ఆయన అంగీరించాడు. తదుపరి మ్యాచ్‌లలో ముఖ్యంగా షార్ట్ బంతులను ధీటుగా ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగుతామని మరోసారి ఆయన స్పష్టం చేశాడు.