క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ మహిళా క్రికెటర్ బ్లాక్‌వెల్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 19: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలెక్స్ బ్లాక్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి అప్పకుంటున్నట్లు ప్రకటించింది. మోస్ట్ కేప్‌డ్ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు ఉన్న అలెక్స్ బ్లాక్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించింది. 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన అలెక్స్ మూడు ఫార్మాట్లలో కలిపి 251 మ్యాచ్‌ల్లో పాల్గొని ఆస్ట్రేలియా జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్న తాను భవిష్యత్‌లో బిగ్‌బాష్ లీగ్‌లో కొనసాగుతానని స్పష్టం చేసింది. బిగ్‌బాష్ లీగ్ ప్రారంభం నుంచి ఆమె సిడ్నీ థండర్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. బ్లాక్‌వెల్ తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 5250 పరుగులు చేసి బ్యాటింగ్ సత్తాను చాటింది. వనే్డల్లో 3492, టీ-20 మ్యాచ్‌ల్లో 1314, టెస్టుల్లో 444 పరుగులు చేసింది
అలెక్స్ బ్లాక్‌వెల్. వెయ్యికిపైగా పరుగులు సాధించిన ఏడుగురు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌లలో బ్లాక్‌వెల్ ఒకరు కావడం విశేషం. బ్లాక్‌వెల్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 2010 సంవత్సరంలో జరిగిన టీ-20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆసీస్‌కు అందించింది. 2005, 2013లో ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో బ్లాక్‌వెల్ కీలక భూమికను పోషించింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి ఆమెను అభినందిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సుధర్‌లాండ్ పేర్కొన్నారు.