క్రీడాభూమి

హర్మన్ ప్రీత్ కౌర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌కు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్, పురుషుల జట్టులో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌కు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డులను ప్రకటించింది. తన అద్భుతమైన ఆటతీరుతో అలరించి, ప్రపంచ కప్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్, పురుషుల జట్టు చేతిమణికట్టు స్పిన్నర్ల ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఈ అవార్డులు దక్కించుకున్నారు. ఈఎస్‌పీఎన్ ఏటా ఇచ్చే అవార్డుల్లో భాగంగా మొత్తం 12 అవార్డు గ్రహీతల్లో ఈ ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. ప్రపంచ కప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ తన కెరీర్‌లోనే అత్యధికంగా 171 పరుగులు చేసింది. ఈమె సాధించిన ఘనతతో భారత్ రన్నరప్‌గా నిలిచి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనను కనబరచినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఇక యజువేంద్ర చాహల్ బెంగళూర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఈ ఘనతతోనే అతనికి అంతర్జాతీయ పోటీల్లో ఆడేందుకు అవకాశం వచ్చింది. ఈ సదవకాశం వచ్చిందే తడవుగా గడచిన మూడు ఫార్మాట్లలో మొత్తం 43 వికెట్లు తీశాడు. పేరొందిన మాజీ క్రికెటర్లు లాన్ చప్పెల్, రమీజ్ రాజా, కౌర్ట్నీ వాష్, మార్క్ బుచర్, డేర్ల్ కలినాన్, రసెల్ అర్నాల్డ్, మాజీ ఎంపైర్ సిమాన్ టఫెల్ వంటివారితో కూడిన 18 మంది జ్యూరీ కమిటీ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది.