క్రీడాభూమి

టీ-20లను పూర్తిగా రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 19: అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ నుంచి టీ-20 క్రికెట్‌లను పూర్తిగా రద్దు చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ కోచ్, మాజీ ఆస్ట్రేలియా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ట్రెవర్ బేలిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ-20 క్రికెట్‌లను తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ, దాని వల్ల ఆటగాళ్లపై మాత్రమే కాదు. కోచ్‌లపై కూడా ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 2017-18 ట్రాన్స్ టాస్మన్ ట్రై సిరీస్ ఫైనల్‌కి చేరుకోవడంలో ఇంగ్లాండ్ జట్టు విఫలం కావడంతో ఆయన ఈ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
‘నేను అంతర్జాతీయ టీ-20లు ఆడను, ఫ్రాంచైజీలతో ఆడేందుకు అనుమతిస్తాను. కానీ ఇన్ని మ్యాచ్‌లు అడటం వల్ల ఆటగాళ్లపై మాత్రమే కాదు కోచ్‌లపై కూడా ఒత్తిడి పెరుగుతుందని’ అని అన్నాడు.
ఐపీఎల్, బీబీఎల్ టోర్నమెంట్‌లలో కోచ్‌గా వ్యవహరించిన బేలిస్ ఐసీసీ టీ-20ని కేవలం ప్రపంచకప్ వరకే పరిమితం చేయాలని హితవు పలికాడు. ఐపీఎల్, బీబీఎల్ వంటి డొమెస్టిక్ టోర్నమెంట్‌లను వీలైనంత త్వరగా రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డాడు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచకప్ జరిగే ఆరు నెలల ముందు అంతర్జాతీయ జట్లతో కొన్ని టీ-20 మ్యాచ్‌లు ఆడించాలని పేర్కొన్నాడు. గత నెలలో బేలిస్ ఇంగ్లాండ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
యువ క్రికెటర్లు రాణించేందుకు వేదిక టీ-20
* విరుచుకుపడ్డ న్యూజీలాండ్ కోచ్ మైక్‌హేసన్
యువ క్రికెటర్‌లు క్రికెట్‌లో రాణిచేందుకు మంచి వేదిక కాగా టీ-20 లీగ్ ఫార్మాట్ కొనసాగుతుందని న్యూజీలాండ్ కోచ్ మైక్‌హేసన్ స్పష్టం చేశారు. టీ-20 క్రికెట్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఇంగ్లాడ్ జట్టు కోచ్ ట్రేవర్ బేలిస్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మైక్ వివరణ ఇచ్చాడు. టీ-20లో తరుచూ క్రికెట్ ఆటగాళ్లు పాల్గొనడంతో వారిపై ఒత్తిడి పెరగడంతోపాటు ఆ భారం కోచ్‌లపై పడుతుందనడం సబబేనన్నారు.
కానీ అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో పాల్గొనే క్రికెటర్‌లు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి టీ-20 ఫార్మాట్ ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 2017-18 ట్రాన్స్ టాస్మట్ ట్రై సిరీస్‌లో భాగంగా ఆదివారం హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండు పరుగులతో న్యూజీలాండ్ చేతిలో ఓటమి పాలైనందుకు ట్రెవర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయం మంచిది కాదన్నారు. క్రికెట్‌లో అనుభవజ్ఞుడైనన్పప్పటికి టీ-20పై పొంతన లేని వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. స్విమ్మింగ్ క్రీడలో 1500 మీటర్లు, 100 మీటర్ల ఈవెంట్‌లో వేర్వేరుగా స్పెషలిస్టులుంటారు కానీ ఒకే స్విమ్మర్ అన్ని ఈవెంట్‌లలో పాల్గొనడని చెబుతూ, వనే్డ ఇంటర్నేషనల్స్, టీ-20 టోర్నమెంట్‌లను కూడా ఒకే ధోరణితో చూడవద్దని మైక్‌హేసన్ సూచించాడు.
చిత్రం..ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్