క్రీడాభూమి

భారత్‌పై సఫారీల సవారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 21: రెండో టీ-20లో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి భారత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్‌కు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌లు భారత్ బౌలింగ్‌ను కట్టడి చేస్తూ వేగాన్ని పెంచారు. దీంతో ఎట్టకేలకు రెండో టీ-20 సఫారీల వశమైంది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ రెండో మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. భారత్ జట్టులో కడుపునొప్పితో బాధపడుతున్న పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో శ్రాద్ధూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్‌ను ప్రారంభించిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. మనీష్ పాండే 79 పరుగులు, వికెట్ కీపర్ ఎం.ఎస్.్ధని 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మొదటి టీ-20లో గెలుపు ద్వారా రెండో మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయిన భారత్ ఆ తర్వాత 11 ఓవర్లలో వరుసగా శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా వికెట్లను కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధావన్ 14 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి డుమిని బౌలింగ్‌లో బెహర్డియన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రోహిత్ శర్మ ఒకే ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే జూనియర్ డాలా చేతిలో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి జూనియర్ డాలా బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. సురేష్ రైనా 24 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో 30 పరుగులు చేసి ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు బ్యాట్‌ను ఝలిపించడంలో విఫలమైనా మనీష్ పాండే, ఎం.ఎస్.్ధని మరో వికెట్ పడకుండా సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. మనీష్ పాండే 48 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఆరు ఫోర్ల సహాయంతో 79 పరుగులు, వికెట్ కీపర్ ఎం.ఎస్.్ధని 28 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా జట్టులో జూనియర్ డాలా రెండు వికెట్లు నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. జీన్ పాల్ డుమినీ రెండు ఓవర్లలో 13 పరుగులిచ్చి ఒక వికెట్, ఆండిలో ఫెహ్లుక్వాయో రెండు ఓవర్లలో 15 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు ప్రత్యర్థి విధించిన 189 పరుగుల లక్ష య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగి 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. జేజే స్మట్స్ తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి ఉన్మద్కత్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. రీజా హెండ్రిక్స్ 17 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో 26 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో హార్థిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. హెన్రిచ్ క్లాసెన్ 30 బంతులు ఎదుర్కొని ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 69 పరుగులు చేసి, ఉన్మద్కత్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. డేవిడ్ మిల్లర్ 6 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో ఎస్.ఎన్.్ఠకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. డుమిని 40 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు బౌండరీల సహాయంతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ఫరహాన్ బెండ్రిన్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ (20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188) : శిఖర్ ధావన్ సి బెహర్డియన్ బి డుమిని 24, రోహిత్ శర్మ ఎల్‌బీడబ్ల్యు జూనియర్ దాలా 0, సురేష్ రైనా ఎల్‌బీడబ్ల్యు ఫెహ్లుక్వాయో 30, విరాట్ కోహ్లీ సి క్లాసెన్ బి జూనియర్ డాలా 1, మనీష్ పాండే 29 నాటౌట్, ఎం.ఎస్.్ధని 52 నాటౌట్ (188/4)
దక్షిణాఫ్రికా: (18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189)
జేజే స్మట్స్ సి రైనా బి ఉన్మద్కత్ 2, రీజా హెండ్రిక్స్ సి హార్థిక్ పాండ్య బి ఎస్.ఎన్.్ఠకూర్ 26. హెన్రిచ్ క్లాసెన్ సి ధోని ఉన్మద్కత్ బి 69. డేవిడ్ మిల్లర్ సి ఎస్.ఎన్.్ఠకూర్ బి పాండ్య 5. జీన్ పాల్ డుమిని 64 నాటౌట్, ఫరహాన్ బెండ్రిన్ 16 నాటౌట్.
దర్బన్ పోరుకు ఆస్ట్రేలియా జట్టు
సౌతాఫ్రికా, ఫిబ్రవరి 21: దర్బన్‌లో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడే ఆస్ట్రేలియా తమ జట్టును దీటుగా బరిలోకి దింపనుంది. అక్లాండ్‌లో పర్యటిస్తున్న తమ జట్టు టీ-20లో ఆడుతున్న డేవిడ్ వార్నర్ మినహా జట్టులో మిగిలిన సభ్యులను వెల్లడించింది. దీంతో ఈసారి ఆస్ట్రేలియా జట్టు బాధ్యతలను స్టీవ్ స్మిత్ చేపట్టనున్నాడు. విల్లోమోరే పార్క్ మైదానంలో గురువారం దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో ఆడనుంది.