క్రీడాభూమి

కోహ్లీ కోరితే విశ్రాంతి ఇస్తాం: బీసీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 22: దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని త్వరలో కోహ్లీ సేన భారత్‌కు రానుంది. ఆ తర్వాత పది రోజుల వ్యవధిలోనే టీమండియా ముక్కోణపు టీ-20 సరీస్ కోసం శ్రీలంక వెళ్లాల్సి ఉంది. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ తనకు విశ్రాంతి కావాలని కోరితే తప్పకుండా ఇస్తామని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హెడ్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ వారాంతంలో కోస్లీతో చర్చించి లంక పర్యటన కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నాతాధికారి మాట్లాడుతూ ఒక వేళ కోహ్లీ ముక్కోణపు సిరీస్ నుంచి ఉపశమనం కల్పించాలని కోరితే తప్పకుండా దానిని పరిగణనలోకి తీసుకుంటాం, విరామం వద్దని చెప్పినా తమకెలాంటి అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. ముక్కోణపు సిరీస్ ముగియగానే ఆటగాళ్లంతా తిరిగి భారత్ చేరుకుని ఐపీఎల్‌తో బిజీ అవుతారని తెలిపారు. భువనేశ్వర్ కుమార్, బుమ్రాకు మాత్రం తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ ఎవరికి విశ్రాంతి ఇచ్చి ఎవరికి జట్టులో స్థానం కల్పిస్తుందో వేచి చూడాల్సిందే. కోహ్లీని తప్పిస్తే జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు దక్కే అవకాశం ఉంది. ‘క్రికెట్‌కు దూరంగా ఉండలేను, అది నా రక్తంలోనే ఉంది’ అని చెప్పిన కోహ్లీ విరామం తీసుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు టీ-20 సిరీస్ మార్చి 6 నుంచి ప్రారంభంకానుంది. ఒక్కో జట్టు మిగిలిన జట్లతో రెండు మ్యాచ్‌లు అడాల్సి ఉంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగనున్న ముక్కోణపు టీ-20 వనే్డ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు మార్చి 18న జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
శ్రీలంక పర్యటనకు కీలక ఆటగాళ్లు దూరం!
అతిథ్య దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం భారత ఆటగాళ్లు బీసీసీఐపై మండిపడుతున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి కరువైందని ఆరోపిస్తున్నారు. దీంతో ఆప్రమత్తమైన బీసీసీఐ ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మక టూర్లకు ముందు జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతి తప్పకుండా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మార్చి 6 నుంచి 18 వరకు జరుగనున్న ముక్కోణపు టీ-20 సిరీస్‌కు ప్రస్తుత జట్టులోని పలువురు ఆటగాళ్లను దూరం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్‌లో లంకతో వరుస సిరీస్‌లు ముగిసిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే కోహ్లీ సేన దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టోర్నమెంట్‌లో పాల్గొంది. పది రోజులు విరామం లేకుండానే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభించారు. దీంతో అప్పట్లో మాజీ క్రికెటర్లతో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేసిన విషయం విధితమే. మరోపక్క దక్షిణాఫ్రికా కూడా భారత్‌తో టీ-20 సిరీస్ ఆనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడనుంది.