క్రీడాభూమి

టీ-20లతో యువతకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 22: ప్రపంచ దేశాలన్నీ ఆదరించే క్రికెట్‌లో రాణించడానికి టీ-20 మ్యాచ్‌లు యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ అన్నాడు. ముఖ్యంగా మహారాష్టక్రు చెందిన యువత ఈ క్రీడలో రాణించడానికి ముంబయి లీగ్ అన్నది చాలా బలమైన వేదిక అవుతుందని, వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం దీనివల్ల కలుగుతుందని ఆయన పేర్కొన్నాడు. ముఖ్యంగా ముంబయి క్రికెట్‌కు టీ-20 లీగ్ వంటి వేదిక ఎంతైనా అవసరమని పేర్కొన్న ఆయన ‘్భరత క్రికెట్‌కు అన్నివేళలా సారధ్యం వహించేది ముంబయి క్రికెట్టే ఇందుకు రాష్ట్రానికి చెందిన ఆటగాళ్ల ప్రతిభా సంపత్తులే నిదర్శనం’ అని పేర్కొన్నాడు. ముంబయి లీగ్‌లో భాగమైనందుకు తాను ఎంతోగానో గర్విస్తున్నట్టు పేర్కొన్న సచిన్ 41 సంవత్సరాలపాటు రంజీ ట్రోఫీని ముంబయి గెలుచుకుందని, ఈ విషయంలో ముంబయి చరిత్ర అద్భుమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి అంశాలను నెమరువేసుకున్నాడు. శివాజీ పార్కు మైదానంలో తాను ఆడిన క్రికెట్‌ను ముఖ్యంగా పాడీ సర్ (పద్మాకర్ శివాల్కర్) తనకు ఆట నేర్పిన అనుభూతులను తెండూల్కర్ మననం చేసుకున్నాడు. అప్పట్లో ఆయన వయసు తనకంటే మూడురెట్లు ఎక్కువైనప్పటికీ తననే బ్యాటింగ్ చేయమనేవాడని తెలిపాడు. ఇలాంటి అనుభూతులు, చిరస్మరణీయమైన అనుభవవాలు ముంబయి లీగ్‌లో ఎన్నో ఎనె్నన్నో ఉన్నాయని గుర్తు చేశాడు. అలాగే ముంబయి క్రికెట్‌లో ప్రతినిధులైనవారితో యువఆటగాళ్లు ఆడడం కూడా ఈ క్రీడలో మెలకువలు నేర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఒక జట్టుగా ఆడినపుడే ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని, అలాంటి సామరస్యపూర్వక క్రికెట్‌నే తాను కోరుకుంటున్నానని తెలిపాడు. తెండూల్కర్‌తోపాటు అంతర్జాతీయ క్రికెటర్లుగా రాణించిన అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, చంద్రకాంత్ పండిట్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ నుంచి రోహిత్ శర్మ, రహానే వరకు అందరూ ముంబయికి చెందినవారేనన్న ఆయన గుర్తు చేశాడు. ముంబయి లీగ్‌లో ఎంతగా రాణించగలిగితే అంతగా క్రికెటర్లు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపాడు. ఈ సందర్భంగా లీగ్ క్రికెట్ గురించి మాట్లాడిన ఆయన తన కెరీర్ కూడా శివాజీ పార్కులో మొదలై జింఖానా మైదానాలకు సాగిందని గుర్తు చేశాడు. ఎంతగా క్రికెట్‌లో రాణించగలిగితే అంతగా కెరీర్ ఎదుగుదలకు ఆస్కారం ఉంటుందని తెండూల్కర్ స్పష్టం చేశాడు. తాను మొదట టెన్నిస్ బాల్‌తోనే క్రికెట్ ఆడేవాడినని గుర్తు చేసుకున్న ఆయన ‘ఈ ఆటలో రాణించాలంటే ప్రతి ఒక్కరికీ ఒక బలమైన వేదిక అన్నది చాలా అవసరం. అప్పుడే ప్రతిభ పదునెక్కుతుంది. సామర్థ్యం వెలుగులోకి వస్తుంది’ అని తెలిపాడు. ఇందుకోసం ముంబయి లీగ్ యువ క్రీడాకారులకు అత్యున్నతమైన వేదిక అని, ముఖ్యంగా టీ-20 ముంబయి లీగ్‌లు ఇలాంటి అవకాశాలను మరింతగా పెంచుతుందని తెండూల్కర్ స్పష్టం చేశాడు.

చిత్రం..ముంబయలో టీ-20 లీగ్ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్