క్రీడాభూమి

లక్ష్య సాధనకు సహనం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 22: ఎవరైనా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందుకు కొంతకాలం సహనం, ఓపికతో వేచిచూడడం వల్ల ఫలితం ఆశాజనకంగా ఉంటుందని భారత క్రికెటర్ మనీష్ పాండే అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20 ఇంటర్నేషనల్ టోర్నీలలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మనీష్ పాండే 48 బంతులు ఎదుర్కొని 79 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌తో 1-1తో సమంగా నిలిచింది. శనివారం జరిగే మూడో మ్యాచ్‌లో గెలిచే జట్టు టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మనీష్ పాండేకు జట్టులో రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు చోటు కల్పిస్తున్నా ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా తనకు వచ్చిన అవకాశలను అందిపుచ్చుకుని తానేమిటో రుజువు చేసుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో మనీష్ పాండే సెంచరీ చేశాడు.
‘టోర్నీలలో ఆడేందుకు చాన్స్‌ల కోసం వేచి చూడాలంటే కొంత ఇబ్బందే. కానీ ఓపికతో వేచిచూసే ధోరణే ఆ తర్వాత కలసి వస్తుంది’ అని మనీష్ పాండే వ్యాఖ్యానించాడు. ఈ విషయం ఇటీవల జరిగిన టూర్‌లో తన విషయంలో అదే జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. జట్టులో అవకాశం కోసం ఎంతోకాలం ఎదురు చూశానని, కానీ భారత్ లాంటి పెద్ద క్రికెట్ జట్టులో ఎందరో స్టార్ ఆటగాళ్లు, ఎంతో పేరుగాంచిన క్రికెటర్లు ఉంటారని, అలాంటపుడు సరైన అవకాశం కోసం కొంతకాలం వేచిచూడక తప్పదని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ-20లో వచ్చిన అవకాశాన్ని సరైన విధంగానే వినియోగించుకుని జట్టుకు పేరు తెచ్చానని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. మైదానంలో దిగేటపుడు నాలుగో ఆటగాడిగా దిగేందుకు కొన్ని చాన్సులు వచ్చాయని, అప్పుడప్పుడు ఐదో స్థానంలో దిగిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటూ బ్యాటింగ్‌లో ఏ స్థానంలో చోటు దక్కినా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా తన వంతు ప్రయత్నం చేయడం తన ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డ సిరీస్ మొత్తానికే పాండేకు ఆడేందుకు అవకాశం దక్కలేదు. జట్టులోని కేదార్ జాదవ్ గాయంతో ఆడే చాన్స్ కోల్పోయినపుడు సైతం ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు కల్పించినా మనీష్ పాండేకు అవకాశం రాలేదు.
2009లో ఐపీఎల్‌లో ఆడిన మనీష్ పాండే తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా సెంచరీ నమోదు చేశాడు. అప్పుడు కూడా ఐదో స్థానంలోనే బరిలోకి దిగి, తానేమిటో రుజువు చేసుకున్నాడు. వనే్డలలో ఆడే అవకాశం కోసం తాను ఎంతోకాలం ఎదురుచూసిన మాట వాస్తవమేనని, కానీ దురదృష్టవశాత్తూ అది కార్యరూపం దాల్చలేదని ఆయన పేర్కొన్నాడు. అయితే, సెంచూరియన్‌లో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లలో ఆడేందుకు మంచి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. ఈ పార్క్‌లో తొమ్మిది పదేళ్ల క్రితం తాను ఐపీఎల్‌లో ఆడిన సందర్భంగా చేసిన సెంచరీని ఎప్పుడూ గుర్తుచేసుకుంటానని అన్నాడు. కనుక ఇక్కడ ఎప్పుడైనా, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశాడు.
బ్యాటింగ్‌లో ఐదో స్థానంలో చోటు దక్కడమంటే చాలా కష్టమేనని, కానీ గతంలో భారత జట్టులో ఇదే స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టార్ క్రికెటర్లు సురేష్ రైనా, యువరాజ్ సింగ్ వంటివారు బాగా ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంటూ వారి స్థాయికి చేరుకోవాలంటే కాస్త కష్టసాధ్యమేనని వ్యాఖ్యానించాడు. గత కొనే్నళ్ల నుంచి భారత బ్యాట్స్‌మెన్‌ల ఆటతీరు భేషుగ్గా ఉంటోందని, కనుక అలాంటి మంచి చాన్స్ కోసం ఎవరైనా కొంతకాలం వేచిచూడక తప్పదని ఆయన అన్నాడు.
దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా ఇటీవల వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్‌లో మనీష్ పాండే 27 బంతులు ఎదుర్కొని 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇపుడు తాజా బుధవారం జరిగిన టీ-20 రెండో మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎం.ఎస్.్ధనీతో కలసి ఐదో ఓవర్‌లో 56 బంతులకు 98 భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇదే తరహాలో భవిష్యత్‌లో కూడా తన ఆటతీరును కొనసాగిస్తానని అన్నాడు.