క్రీడాభూమి

భారత బాడ్మింటన్‌కు స్వర్ణయుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత బాడ్మింటన్ రంగానికి వచ్చేది స్వర్ణయుగమేనని స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పేర్కొన్నాడు. త్వరలో జరుగనున్న కామనె్వల్త్ గేమ్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న భారత బాడ్మింటన్ క్రీడాకారులు ప్రత్యర్థులకు దీటైన జవాబు ఇవ్వనున్నారని ఆయన హెచ్చరించాడు. ప్రపంచ టాప్ 15 బాడ్మింటన్ క్రీడాకారుల్లో శ్రీకాంత్ ర్యాంక్ 3, హెచ్‌ఎస్.ప్రణయ్ 11, సాయి ప్రణీత్ 14వ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ చైనా ఆటాగాళ్లను ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద సమస్య కాదన్నారు. మహిళల విషయానికి వస్తే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ప్రపంచ ర్యాంక్ నాలుగో క్రీడాకారిణి పీవీ.సింధూ, ర్యాంక్ నెంబర్ 11 క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో పాటు పురుషుల సింగిల్స్‌లో ఐదు, ఆరుగురు ఆటాగాళ్లతో కలిసి డబుల్స్‌లో రాణించగలుగుతారని ఆశాభవం వ్యక్తం చేశాడు. గత పది సంవత్సరాల్లో అనేక మంది భారత షట్లర్లు కఠోర శిక్షణ పొందుతూ వివిధ స్థాయి టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను వణికిస్తున్నారని చెప్పాడు. వ్యక్తిగత బ్యాడ్మింటన్ హీరో ప్రకాష్ పదుకోనే 1980లో ప్రతిష్టాత్మకమైన ఆలింగ్లాండ్ పురుషుల టైటిల్‌ను సాధించిన మొదటి వ్యక్తి అని గుర్తుచేశాడు. శ్రీకాంత్ చక్కటి ఆటతీరును కనపరిచి ఒకే సంవత్సరంలో నాలుగు సూపర్ సిరీస్ వరల్డ్ టూర్ టైటిళ్లను సొంతం చేసుకుని రెండో ర్యాంక్‌లో నిలిచాడు. శ్రీకాంత్ చైనాకు చెందిన మేటి షట్లర్ లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత్ బాడ్మింటన్ క్రీడాకారులకు ఇక మంచి రోజులేనని, ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తన 25 ఏళ్ల సోదరుడు కె.నందాగోపాల్ ఏప్రిల్‌లో జరుగనున్న కామనె్వల్త్ గేమ్స్, ఆగస్టులో జరుగనున్న ఆసియా క్రీడల్లో పతకం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశాడు.