క్రీడాభూమి

రాజీనామా ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 2: ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు దారుణంగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని 82 ఏళ్ల షహర్యార్ స్పష్టం చేశాడు. బోర్డులో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు మీడియాకు చేరడం పట్ల షహర్యార్ అసంతృప్తితో ఉన్నాడు. దీనికితోడు ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాక్ పూర్తిగా విఫలమైంది. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని షహర్యార్ రాజీనామా చేయనున్నట్టు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా అతను వైదొలగాల్సిందేనని కోరుతున్నారు. అయితే, రాజీనామా చేయాల్సిన అవసరం తనకు ఏమీ లేదని షహర్యార్ తేల్చిచెప్పాడు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైదొలగేది లేదని అన్నాడు.